“నాకు ఆ జ్ఞానం లేదు” అంటూ నాగబాబు సంచలన పోస్ట్..!!

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువుగా యాక్టీవ్ గా ఉంటున్నారు. జనసేన తరుపున ప్రచారం చేసుకోవడానికో..లేక అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండటానికో తెలియదు కానీ..సోషల్ మీడియాలో పలు రకాల కాంట్రవర్షీయల్ న్యూస్ పై స్పందిస్తూ..కొత్త తలనొప్పులు కొన్ని తెచ్చుకుంటున్నాడు అంటున్నారు సినీ పేముఖులు. అసలే మెగా ఫ్యామిలీ అంటే కాచుకుని కూర్చుంటారు కొందరు భజన బ్యాచ్..అలాంటి వాళ్ళకి నాగబాబు కామెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెడూతుంటాయి.

దీంతో మెగా హేటర్స్ కు గట్టి సమాధానాలు ఇస్తుంటారు ఆయన. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నాకూడా వాళ్లను రప్ఫాడించేస్తారు. అయితే, నాగబాబు రీసెంట్ గా చేసిన పోస్ట్ నెట్టింట ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు అమ్మ, నాన్న. వీళ్లిద్దరు లేకపోతే మనకు పుట్టుకలేదు. అలాంటి పేరంట్స్ ని నేటి సమాజంలో చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. కొందరు వాళ్ళ వర్క్స్ లో పడి కనీసం “ఎలా ఉన్నారు” అని పట్టించుకునే టైం కూడా లేకుండా పోరారు.

అయితే తాజాగా నాగబాబు తన తండ్రి పుట్టిన రోజు సంధర్భంగా..ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ‘నాన్నా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది నీకు నేను నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండేది. అప్పుడు అలా చెప్పాలనే సెన్స్‌ గానీ, జ్ఞానం కానీ నాకు లేవు. అందుకే అప్పుడు చెప్పలేకపోయా.. అవి నాకు వచ్చాయనుకున్నప్పటికి నువ్వు నా పక్కన లేవు . దయచేసి అందరికి చెప్తున్నా.. మీ ఆత్మీయులకు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్‌ పంచుకోండి’ అంటూ ఎమోషన్ల్ పోస్ట్ చేసాడు. ఈ మేరకు తన తండ్రి ఫొటోను షేర్‌ చేశాడు. అయితే కొందరు మెగా హేటర్స్ నీకు సెన్స్ ఎప్పుడు లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest