బిల్ గేట్స్ తో మహేష్ బాబు …అందుకేనా …?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..చాలా సైలెంట్ హీరో. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీలో ఉండటం చాలా అరుదు. ఎటువంటి గొడవలకు పోకుండా..తన పని తాను చూసుకుంటూ..కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయకుండా ఉండే ఈ హీరో ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా షూటింగ్ లల్లో ఎంత బిజీ గా ఉన్నా ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం గడుపుతారు.

- Advertisement -

సమయం దొరికినప్పుడల్లా..ఫ్యామిలీతో టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న..ఈ హీరో..త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాడు. కాగా, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం ఉండటంతో ..ఈలోపు ఫ్యామిలీ తో వెకేషన్ కు వెళ్ళాడు.

ఫ్యామిలీ తో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ..వాళ్ళు ఎంజాయ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ తాలుకా పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. కాగా ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పంచుకున్న సెన్సేషనల్ పిక్ మాత్రం నెట్టింట ట్రెండింగ్ గా మారింది. మహేష్ రీసెంట్ గా ప్రపంచ అతి పెద్ద బిలినియర్స్ లో ఒకరైన దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన పిక్ ని అయిన అభిమానులతో పంచుకున్నారు. మహేష్ మరియు ఆయ్న భార్య నమ్రత ఇద్దరు బిల్ గేట్స్ కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోను నెట్టింట పోస్ట్ చేయగా..అది చూసిన అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మీట్ పై మహేష్ రాసుకొస్తూ..” ప్రపంచంలో గ్రేటెస్ట్ విజన్ కలిగిన వ్యక్తుల్లో బిల్ గేట్స్ ఒకరు. ఆయని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక ఇన్స్పిరేషన్ “..అంటూ మహేష్ పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఫోటో ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.

Share post:

Popular