“జై బాలయ్య”..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న బుడ్డోడి వీడియో చూశారా..!!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో అందరికి గౌరవం. ఆయన చేసే పనులు అలా ఉంటాయి మరి. తాను ఊరికే ఎవ్వరి జోలికి వెళ్లడు..తన జోలికి వచ్చాడా దబిడి దిబిడే. ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్పడం..బాలయ్య ను చూసే నేర్చుకోవాలి. ఓ మంచి పని చేస్తే పిలిచి అప్రిషీయేట్ చేసే బాలయ్య..కోపం వస్తే ఆ రేంజ్ లోనే కోటింగ్ ఇస్తారు. బాలయ్య కోపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

- Advertisement -

యంగ్ హీరోలకి ధీటుగా వరుస సినిమాలకి కమిట్ అవుతూ ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య..ప్రజెంట్ గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ సినిమాలో బాలయ్య మనల్ని సరికొత్త గెటప్ లో ఎంటర్ టైన్ చేయనున్నాడు అని తెలుస్తుంది.

కాగా, రీసెంట్ గా బాలయ్య ఫ్యాన్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంట్లో పూజ గదిలో దేవుడి పటాల ముందు పూజ చేస్తున్నప్పుడు ఆ బాబు వాళ్ళ అమ్మ జై సాయి రాం అని అనమంటుంది. అయితే, ఆ బుడ్డోడు మాత్రం జై బాలయ్య అంటూ గట్టిగా అరుస్తారు. వాళ్ల అమ్మ చెప్పినా కూడా మాట వినకుండా జై బాలయ్య అని చాలా క్యూట్ గా ముద్దు ముద్దుగా అంటాడు. దీంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో అమెరికా లో తీసిన్నట్లు తెలుస్తుంది. ఈ తరం పిల్లల పై కూడా బాలయ్య ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ఈ వీడియోని చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది.

Share post:

Popular