వావ్: ట్విట్టర్ లో అరుదైన రికార్డు సాధించిన తారక్..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా విడుదలైన RRR చిత్రంతో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నందమూరి అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఈ విజయం ఎన్టీఆర్ ఒక్కడిదే కాదు అని చెప్పవచ్చు. అందుచేతనే తారక్ ఫాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా పరంగా క్రేజ్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.

సోషల్ మీడియాలో తరచుగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం భారీగా పెరిగి పోతూనే ఉన్నది. తాజాగా ట్విట్టర్లో ఎన్టీఆర్ 6 మిలియన్ల మార్క్ ను టచ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ 60 లక్షల ట్విట్టర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇక ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ బర్తడే కానుకగా తన 30 వ సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమాపై ఆయన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చి బాబు తో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్.

Share post:

Popular