పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేసుంటే హిట్ అయ్యేదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. తెలుగునాట పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ మరే హీరోకి లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆయన అభిమానులు సంక్రాతి సంబరాలు జరుపుకుంటారు. అవును.. ఓ తెలుగు పండగకు వారు ప్రాముఖ్యత ఇస్తారో లేదో తెలియదు కానీ, పవన్ సినిమా వచ్చిందంటే వారి చేసే రచ్చ రాష్ట్రం మొత్తం వినబడుతుంది. ఆయన నటించిన సినిమా ప్లాప్ అయినా కూడా ఆయన అభిమానులు సినిమా హిట్ అయినట్టు ప్రచారం చేసి మరీ హిట్ చేస్తారు. అంతలా ఆయన మానియా ఇక్కడ కలదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలతో పాటు మరొకవైపు రాజకీయాలలో ఫుల్ బిజీగా వున్న విషయం తెలిసినదే. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఒక వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. అదేమంటే, ఓ పెద్ద డిజాస్టర్ నుండి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడు అంటూ ఆయన అభిమానులు రిలాక్స్ అయ్యారు. విషయంలోకి వెళితే, తాజాగా గోపి గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గాడ్సే సినిమా రీసెంటుగా విడుదలై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సత్యదేవ్-గోపి కలిసి చేసిన ఈ గాడ్సే సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ విషయమే పవన్ అభిమానుల సంతోషానికి కారణం. ఎందుకంటే, గోపి గణేష్ ఈ సినిమా కథని మొదట పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టు సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండి, డేట్స్ ఇవ్వకపోవడం వలన సత్యదేవ్ తో ఈ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు గోపి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించి ఉంటే ఆయన జీవితంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచిపోయేది అని పవన్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Share post:

Latest