సినిమా హిట్ అయితే నీకు ఆ భయం ఎందుకు అనిల్ రావిపూడి..?

అనిల్ రావిపూడి..ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామ అన్నది కాదు..హీట్లు కొట్టామా లేదా..అన్నది పాయింట్. ఇప్పుడు ఈ డైలాగ్ నే వాడుతూ అనిల్ ను పొగిడేస్తున్నారు ఆయన అభిమానులు. మనకు తెలిసిందే అనిల్ రావిపూడి డైరెక్టర్ గా చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాను తెరకెక్కించి పాజిటివ్ హిట్ ను అందుకుని డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి.

ఇక ఆ తరువాత తీసిన అన్ని సినిమా మంచి హిట్ అందుకున్నాయి. రీసెంట్ గా వెంకటేష్, వరుణ్ లతో కలిసి F3 సినిమాను తెరకెక్కించి కెరీర్ లో మరో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే, ఆయన ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన సినిమా గురించే కాదు..తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆయనని యాంకర్ వరుస సినిమాలు విజయం సాధిస్తున్నాయి..కెరీర్ లో మంచి హిట్స్ అందుకుంటున్నారు..దీని పై మీ స్పందన అని అడగ్గా..అనిల్ మాట్లాడుతూ..”సినిమాలు హిట్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని అనిపిస్తుంది. అదే టైంలో భయం గా కూడా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో యాంకర్ “భయమా..సినిమా హిట్ అయితే భయం ఎందుకు అండి”..అని అడగ్గా..వెంటనే అనిల్ సమాధానం ఇస్తూ..” మనం హిట్ కొట్టిన ప్రతిసారి అభిమానులు మన దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా పై ఇంకా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఒకవేళ అలా మనం వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాకపోతే..అప్పటి వరకు పొగిడిన వారే..ఆపై తిడతారు కూడా..”అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు. ఇక అనిల్ తన తరువాతి ప్రాజెక్ట్ బాలయ్యతో చేస్తున్న సంగతి తెలిసిందే..!!

Share post:

Popular