ఇక పై నా సినిమాలో ఆ హీరోయిన్ ఉండదు..అనిల్ బిగ్ బాంబ్..?

అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. రీసెంట్ గా F3 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్..నెక్స్ట్ చిత్రం నందమూరి బాలయ్య తో కమిట్ అయ్యాడు. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకున్న అనిల్..అన్ని కుదిరితే అక్టోబర్ లేదా నవంబరు లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఆయన్..తన లైఫ్, గురించి..సినిమాల కు సంబంధించిన విషయాల గురించి..ఓపెన్ గా చెప్పుకురావడం..అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఆయన మాట్లాడుతూ..” F3 సినిమా మంచి హిట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉందని. ఈ హిట్ తో తన పై బాధ్యత ఇంకా పెరిగిందని. ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా కూడా అభిమానులను ఎంటర్ టైన్ చేసే విధంగానే ఉంటుందని” హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తమన్నా తో గోడవ అంటూ వస్తున్న వార్తల పై స్పందిస్తూ..”నిజానికి అక్కడ అంత పెద్ద గొడవ ఏం జరగలేదని. సినిమా షూటింగ్ అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయని. ఓ రెండు రోజులు షూటింగ్ టైమింగ్ లో మార్పులు వచ్చాయని. నైట్ కొంచెం లేట్ అయ్యింది షూటింగ్..ఆ టైంలో కొంచెం చిరాకు చూయించిందని. ఆవిడ మార్నింగ్ జీమ్ కి వెళ్ళాలి కదా టైం సరిపోదు..అన్నట్లు “చెప్పుకొచ్చాడు అనిల్.

“నా సినిమా విషయం లో నేను ఖచ్చితంగా ఉంటానని. ఒకరు నన్ను ఇబ్బంది పెట్టిన నా సినిమా కోసం నేను తగ్గి పెళ్లిపోతానని. లేదంటే నా సినిమా పై ఎఫెక్ట్ పడుతుందని చెప్పిన ఆయన పరోక్షంగా తమన్నా ని బ్యాడ్ చేసిన్నట్లైంది. అంతా మాట్లాడేసిన తరువాత..”ఇప్పుడు మేం సెట్ అయ్యిపోయామని..ఆ రెండు రోజులు అలా ఆ హీట్ నడిచిందని. ఆ న్యూస్ బయటకు వేరేలా వచ్చిందని..త్వరలోనే తమన్నా F3 ప్రమోషన్స్ లో పాల్గొటుందని” క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు F4 సినిమా పై మాట్లాడుతూ..F4 ఖచ్చితంగా చేస్తానని చెప్పిన ఆయన..కొంచెం టైం పడుతుందని..కానీ, F4 లో మాత్రం ఈ హీరోయిన్స్ ఎవ్వరు ఉండరని..కొత్త ముఖాలు కనిపిస్తాయి అని కుండ బద్ధలు కొట్టిన్నట్లు చెప్పేసారు.

Share post:

Latest