ఆ హీరోయిన్ బుగ్గలు చూస్తే కొరుక్కు తినాలి :-చిరంజీవి

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తీయ్యడం కాదు..ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేదాని పై అందరు ఫోకస్ చేస్తున్నట్లు ఉన్నారు. అప్పట్లో సినిమా అంటే కధను చూసేవారు..మరి ఇప్పుడు సినిమాలో బూతులు ఉండేలా చూసుకుంటున్నారు. సినిమాలోనే కాదు ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న ఫంక్షన్లో నైన..కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి..సినిమాకి పబ్లిసిటీ చేసుకోవటం బాగా అలవాటు అయిపోయింది.

- Advertisement -

ఇండస్ట్రీకి నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు అంటే పర్లేదు కానీ..టాలీవుడ్ మెగాస్టార్ సైతం అలా చీప్ కామెంట్స్ చేసి సినిమాకి హైప్ ఇవ్వాలి అనుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో చిరు..సినిమా ఫంక్షన్లకి చీప్ గెస్ట్ గా ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఆ మధ్య తాప్సీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చి..ఎంత హంగామ చేసారో మనకు తెలిసిందే. తాప్సీ తో నటించలేకపోయానే అని బాధపడ్డారట. ఆ రేంజ్ లో పొగిడేశారు.

ఇక ఆ తరువాత ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో అయితే పూజా ను హగ్ చేసుకుంటున్నట్లు ఫోటోకి ఫోజులిచ్చి..ఈ వయసులో ఇదేం పని..అని ట్రోలింగ్ కు గురైయ్యాడు. ఇక ఇప్పుడు పక్క కమర్షీయల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీదేవి బుగ్గలు వంకాయ కూరతో కంపేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసారు. ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ రావు రమేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. “ఇన్నాళ్ల నా కెరీర్ లో రావు రమేశ్ ను మీట్ అవ్వడం.. సినిమాల్లో నటించడం కుదరలేదు. త్వరలోనే ఆ రోజు రావాలని కోరుకుంటున్నా..రావు రమేశ్ తండ్రి రావు గోపాల్ ని నేను చిన్న మావయ్యగారు అంటూ పిలుస్తుంటాను. ఆయనతో నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఎప్పుడైన షూటింగ్ లో మేం ఇద్దరం లంచ్ టైంలో కలిసిస్తే నాకు ఆయన ఇంటి భోజనం రుచి చూయించేవాడు. ఈ క్రమంలో చాలా సార్లు వంకాయ కూర దగ్గర మాకు ఫన్నీ మాటలు నదిచేవి. వంకాయ కూరను తినకుండా వదిలేసినప్పుడు.. “అయ్యాయో నువ్వు ఎందుకలా వంకాయ వదిలేస్తున్నావ్..నీకు ఆ వంకాయను చూస్తే శ్రీదేవి బుగ్గలు గుర్తు రావట్లేదా.. వయసుల్లో ఉన్న కుర్రాడివి ..అవి చూస్తే కొరుక్కు తినాలి అంటూ ప్రోత్సహించే వారని” ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీంతో చిరు మాటల పై శ్రీదేవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. మరోపక్క మెగా హెటర్స్ చిరంజీవి కూడా పబ్లిసిటీ కోసం చీప్ మాటలు మాట్లాడుతున్నాడా అంటూ షాక్ అవుతున్నారు. టోటల్ గా..ఇప్పుడు చిరంజీవి-వంకాయ-శ్రీదేవి..ఈ మాటలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.

Share post:

Popular