ఆ సినిమా నా రాంగ్ సెల‌క్ష‌న్‌.. వెంక‌టేష్ చేస్తే సూప‌ర్‌హిట్ అన్న చిరంజీవి…!

సినిమా రంగంలో కొంద‌రు హీరోల‌కు కొన్ని క‌థ‌లు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొంద‌రు హీరోలు యాక్ష‌న్ చేస్తేనే బాగుంటుంది.. మ‌రి కొంద‌రు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్ష‌న్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌దు. అలాంట‌ప్పుడు ఎంత మంచి స‌బ్జెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేవు. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి.

చిరు హీరోగా ఇంద్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు ముందుగా 2001 అక్టోబ‌ర్ 4న డాడి సినిమా వ‌చ్చింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అరవింద్ నిర్మించారు. చిరంజీవికి జోడీగా సిమ్రాన్‌, ఆషిమాభ‌ల్లా హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్‌గా నిలిచింది. ఇందుకు కార‌ణం సినిమా క‌థ‌, క‌థ‌నాలు బాగున్న‌ప్ప‌ట‌కీ చిరు ఇమేజ్‌కు సూట్ కాలేదు. ఓవ‌ర్ సెంటిమెంట్ అయిపోయింది.

అయితే ఈ సినిమా త‌న రాంగ్ చాయిస్ అని.. ఈ సినిమాలో కామెడీ సీన్లు చూసిన‌ప్పుడు కూడా బాగానే ఉంటుంద‌ని.. అయితే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల నుంచి అనుకున్నంత ఆద‌ర‌ణ రాలేద‌ని చిరు గ‌తంలో కూడా అన్నారు. అయితే టీవీల్లో ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చినా మ‌హిళా ప్రేక్ష‌కులు చాలా బాగా చూస్తూ ఉంటారు. ఇది నిజం కూడా..! ఈ సినిమా విష‌యంలో చిరు మాత్రం తాను చేయాల్సిన సినిమా కాద‌ని ఎప్పుడూ అంటూనే ఉంటారు.

ఎఫ్ 3 ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో సైతం వెంక‌టేష్‌ను చూడ‌గానే చిరుకు డాడి సినిమాయే గుర్తుకు వ‌చ్చింది. ఆ సినిమా వ‌చ్చిన‌ప్పుడే చిరు.. వెంకీతో నువ్వు ఏడిస్తే ప్రేక్ష‌కులు చూస్తారు.. నేను ఏడిస్తే చూడ‌లేరు.. డాడీ సినిమా నువ్వు చేయాల్సిన సినిమా.. నువ్వు క‌నుక ఆ సినిమా చేసి ఉంటే ఖ‌చ్చితంగా హిట్ అయ్యేద‌ని చెప్పార‌ట‌. ఆ టైంలో వెంక‌టేష్ వ‌రుస‌గా కోలీవుడ్ హిట్ సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేస్తూ వ‌రుస‌గా హిట్లు కొడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే డాడీ సినిమాలో వెంకీ న‌టిస్తే.. ఆ సెంటిమెంట్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యేద‌న్న‌దే చిరు న‌మ్మ‌కం. అందుకే ఎఫ్ 3 ప్ర‌మోష‌న్ల‌లో వెంకీని చూసిన వెంట‌నే ఆ డాడీ సినిమాను చిరు మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

Share post:

Popular