ఫ్యాన్స్‌కు ‘ మెగా ‘ షాక్ త‌గిలిందే… చిరు షాకింగ్ డెసిష‌న్‌…!

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల పాటు ఖాళీగా ఉండి త‌న 150 సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ త‌ర్వాత చిరు రేంజ్‌కు త‌గ్గ సినిమా ప‌డ‌డం లేదు. ఈ విష‌యంలో అభిమానులు కూడా డిజ‌ప్పాయింట్ గానే ఉన్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా అస‌లే రీమేక్‌. త‌మిళ్‌లో వ‌చ్చిన మూడు నాలుగేళ్ల‌కు కానీ తెలుగులో రీమేక్ చేయ‌లేదు. పైగా వీక్ క‌థ‌నం.. ముత‌క కామెడీ.. ప‌స‌లేని డైలాగులు ఉన్నా కూడా కొన్ని మాస్ అంశాల‌కు తోడు చిరు లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెర‌పై క‌న‌ప‌డ‌డంతో ప్రేక్ష‌కులు, చిరు అభిమానులు ఒక‌టికి రెండు సార్లు చూడ‌డంతో ఆ సినిమా హిట్ అయ్యింది.

ఆ త‌ర్వాత సైరా భారీ బ‌డ్జెట్‌తో కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఆ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డో క‌నెక్ట్ కాలేదు. క‌ట్ చేస్తే సైరా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి కొర‌టాల శివ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఆచార్య ఘోర‌మైన డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో పాటు చిరు ప‌రువు తీసేసింది. అస‌లు ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చిరు అభిమానులు కూడా ఈ సినిమా చూసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

ఇక ఇప్పుడు వ‌రుస పెట్టి చిరు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ముందుగా వ‌స్తోంది గాడ్‌ఫాద‌ర్‌. మ‌ళ‌యాళ హిట్ మూవీ లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోంది. మోహ‌న‌రాజా ద‌ర్శ‌కుడు.. న‌య‌న‌తార హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 15 కానుక‌గా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు క‌థ అడ్డం తిరిగిన‌ట్టు టాక్ ?

తన సినిమాలు ఏవీ ఇప్పట్లో విడుదలకు ప్లాన్ చేయవద్దని మెగాస్టార్ చిరంజీవి తన నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశార‌ట‌. ఆగ‌స్టులో అనుకున్న గాడ్‌ఫాద‌ర్ సెప్టెంబర్ కు వాయిదా పడిపోయిందట‌. జ‌నాలు ఆచార్య ప్లాప్ మ‌ర్చిపోయి మ‌ళ్లీ త‌న సినిమా రిలీజ్ కోసం ఆతృత‌గా వెయిట్ చేసే వ‌ర‌కు గాడ్‌ఫాద‌ర్‌ను రిలీజ్ చేయ‌వ‌ద్ద‌ని చెప్పేశార‌ట‌. చిరు సినిమాలు వ‌రుస‌గా లైన్లో ఉన్నాయి. వ‌చ్చే స‌మ్మ‌ర్ వ‌ర‌కు ఏకంగా మూడు సినిమాలు కంటిన్యూగా రిలీజ్ కావాల్సి ఉంది. మ‌రి ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ? చూడాలి.

Share post:

Popular