పవన్ చేసిన పనికి చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి.. అసలేం జరిగిందంటే…!

పవన్ కల్యాణ్ ఒక పవర్ స్టార్‌గా మారారు అంటే అందులో చిరంజీవి పాత్ర అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. పవన్ యువ ప్రాయంలో చంచలమైన మనస్తత్వంతో సతమతమవుతున్నప్పుడు చిరంజీవియే అతన్ని సరైన మార్గంలో నడిపించారు. ఒక అన్నలా కంటే తండ్రిలా చిరు పవన్ జీవితాన్ని చక్కదిద్దారని చెప్పవచ్చు. చిరు చాలా నెమ్మదస్తుడయితే.. పవన్ చాలా దూకుడుగా ఉంటాడు. ఈ దూకుడు వల్లే ఒకనొక సందర్భంలో చిరంజీవి కొందరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. డైరెక్టర్ కోడి రామకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ప్లాన్ చేసిన ఒక సినిమా షూటింగ్‌ను చెన్నైలో పెట్టుకున్నారు. అయితే చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా.. కొందరు ఆకతాయిలు, గుండాలు అక్కడే గుమిగూడారు. ఇది చాలదన్నట్టు అల్లరి చేస్తూ దుర్భాషలాడటం మొదలుపెట్టారట. అయితే చిరంజీవి వారి అల్లరిని చూస్తూ కామ్‌ గానే ఉండిపోయారు. ఈ క్రమంలోనే చిరు డ్రైవర్ పవన్ కల్యాణ్ కి ఫోన్ చేసి షూటింగ్ వద్ద నెలకొన్న పరిస్థితి గురించి చెప్పాడట. అంతే, క్షణాల్లోనే షూటింగ్ స్పాట్ కు విచ్చేసిన పవన్ పదుల సంఖ్యలో ఉన్న ఆకతాయిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ వార్నింగ్‌ను వారు లెక్కచేయకుండా మరింత దురుసుగా ప్రవర్తించడంతో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరికొకరు పోట్లాటకు దిగడంతో ఆకతాయిల్లోని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి చాలా బాధపడ్డాడట. తప్పు ఎవరిదైనా ఒక వ్యక్తికి గాయాలు కావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఆస్పత్రికి వెళ్లి మరీ తన తమ్ముడు పవన్ కల్యాణ్ చేసిన పనికి క్షమాపణలు కూడా తెలియజేశారు. అలాగే వైద్యానికి అయ్యే ఖర్చులకు తానే సొంతంగా భరించారు. అనంతరం ఇకమీదట ఇలాంటి గొడవలు పునరావృతం కాకూడదని కల్యాణ్ వద్ద మాట కూడా తీసుకున్నారు. అందుకే పవన్ ఆ తర్వాత ఎన్నడూ గొడవలకు వెళ్ళలేదు.

Share post:

Popular