తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న బండ్ల గణేష్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఆయన అంతలా ఎప్పుడు స్పీచ్ లు ఇస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక నిర్మాతగా బండ్ల గణేష్ ఎన్నో చిత్రాలను నిర్మించారు. తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం జరిగింది. ఇక అంతే కాకుండా స్టేజి పైన మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ గా మారాయి.

ఆకాశ్ చోర్ బజార్ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కూడా పూరి జగన్నాథ్ కనిపించలేదు. కేవలం షూటింగ్ కి ఒకసారి మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది .ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తప్పనిసరిగా పూరి జగన్నాథ్ వస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఈ ఈవెంట్ కి రాకుండా ముంబై లో బిజీగా ఉన్నారు. దీంతో బండ్ల గణేష్ హర్ట్ అయ్యి ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

నువ్వు నీ కొడుకు సినిమా ఫంక్షన్ కి ముంబై నుండి రాలేనంత బిజీగా ఉన్నావా అంటూ వేదికపైన పూరీ జగన్నాథ్ ను నేరుగా ప్రశ్నించాడు బండ్ల గణేష్ .. నా కొడుకు కోసం నేను అయితే లండన్ లో ఉన్నా సరే స్పెషల్ ఫ్లైట్ లో వచ్చే వాడిని అని తెలియజేశారు. ఇక మనం బతుకుతున్నది కేవలం మన పిల్లల కోసం మన కుటుంబ కోసమే అని తెలియజేశారు. అన్న ఇంకోసారి ఇలాంటి పని చేయకు నీకు దండం పెడతాను అని రిక్వెస్ట్ చేశాడు బండ్లగణేష్.

రేపటి రోజున ఆకాశ్ స్టార్ హీరో అయ్యాక నీతో సినిమా చేయద్దు అని చెప్తా అంటూ చమత్కారంగా మాట్లాడారు. ఇక అదే వేదికపై పూరీ భార్య లావణ్య ను సీతా దేవి తో పోలుస్తూ ఆమె ఉత్తమ ఇల్లాలు అని తెలియజేశాడు. పూరి జగన్నాథ్ దగ్గర డబ్బులు లేని సమయంలో ఆమె తన వెంట ఉన్నది పూరి జగన్నాథ్ స్టార్ డం వచ్చాక చాలా మంది వచ్చారు కానీ ఈమె కంటే గొప్ప వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అని తెలియజేశారు బండ్ల గణేష్. పూరి ఎంతో మంది స్టార్స్ ను చేశారు. కానీ తన కుమారుడిని ప్రోత్సహించడానికి ఎవరూ రాలేదు. ప్రమోషన్ చేయకుండా .. తమకు పోటీ వస్తారని భయపడుతున్నారని పూరీ హీరోలపై కామెంట్ చేశారు బండ్ల గణేష్. దీంతో బండ్ల గణేష్ చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Popular