బాలయ్య బాబు బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్ చెప్పే బెస్ట్ స్లొగన్స్ ఇవే..!

ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా ఎదిగిన బాలకృష్ణ నిన్నటితో 62 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. బాలయ్య 1974లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి బాలకృష్ణ హీరోగా వందకు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మొన్నీమధ్యన వచ్చిన అఖండ వంటి చాలా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. బాలయ్య నటించని పాత అంటూ ఏదీ లేదు. అన్ని పాత్రల్లోనూ ఆయన కనబరిచిన నటనా చాతుర్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన నటనకు, డైలాగ్ డెలివరీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఈ అభిమానులందరూ సినిమా థియేటర్లలో బాలయ్య కోసం చేసే స్లొగన్స్ భలే ఆకట్టుకుంటాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఉత్తమ స్లొగన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కోకాకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ

మా బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు

పాలకూర పప్పు.. బాలయ్య బాబు నిప్పు

అడవిలో పుడితే సింహంలా పుట్టాలి రా.. మరో జన్ముంటే బాలయ్యబాబు అభిమాని లా పుట్టాలి.

మేం తినేది ఉప్పు కారం బాలయ్య బాబు మీద చావదు మమకారం

ఇండియాకు పీఎం మోడీ.. ఇండస్ట్రీకి బాలయ్యబాబు డాడీ

రాముడు, భీముడు.. మా బాలయ్య బాబు దేవుడు

ఈస్ట్ వెస్ట్ బాలయ్య బాబు బెస్ట్

ఒకటి.. రెండు.. మూడు.. బాలయ్య బాబు ముందు ఎవడు!

మాజా, ఫ్రూటీ.. బాలయ్య బాబు నాటీ

హాటు, స్వీటు.. బాలయ్య బాబు ఘాటు

వాడెవడు, వీడెవడు, మా బాలయ్య బాబుకి అడ్డెవడు

కారు లోన్, బైక్ లోన్..బాలయ్య బాబు సైక్లోన్..!!

వాటర్, క్వార్టర్ బాలయ్య బాబు డిక్టేటర్..

ఇంట్లో ఉంది స్విమ్మింగ్‌పూల్.. బాబయ్య బాబు వాడే వార్డ్ బ్లడీ ఫూల్

Share post:

Popular