ఎఫ్ త్రీ దెబ్బతో బాలయ్య కండిషన్ మామూలుగా లేదే..!

నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయనతో పక్క మాస్ సినిమాలు చేస్తే అఖండ తరహాలో మంచి విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను మూడు సార్లు రుజువు చేసి చూపించాడు. ప్రస్తుతం ఆయన తో వర్క్ చేయడానికి ఎంతో మంది దర్శకులు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తన తదుపరి సినిమాలో బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు గా సమాచారం. బాలకృష్ణ 107 వ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

అయితే వరుసగా యాక్షన్ సినిమాలు బాలకృష్ణకు విసుగొచ్చి..తనలోని విభిన్నమైన కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బలమైన కోరికతో బాలకృష్ణ ఉన్నట్లుగా సమాచారం. ఇటీవల ఎఫ్3 సినిమాను బాలయ్య ప్రత్యేకంగా వీక్షించడం జరిగినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య అనిల్ రావిపూడి పనితనాన్ని చూసి తన తదుపరి సినిమాలో కూడా కామెడీని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఒక కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలని తన కెరీర్ మొదటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసిన అనిల్ రావిపూడి మొత్తానికి తన తదుపరి చిత్రంలో అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇక ఈ చిత్రం పక్కా కమర్షియల్ గా ఉంటుందని.. బాలకృష్ణను ఇది వరకు ఎవరూ చూడని తరహాలో చూపించబోతున్నట్లుగా డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే బాలయ్య బాబు మాత్రం బయట ప్రపంచంలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి కామెడీ సినిమాలకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని.. అందుచేత తన తదుపరి చిత్రాన్ని మాస్ కమర్షియల్ అంశాలతో పాటుగా కామెడీ సన్నివేశాలు కూడా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి.

Share post:

Popular