బాలయ్య-గోపీచంద్ మూవీకి అదిరిపోయే క్రేజీ టైటిల్

వయస్సు ఎంత పెరిగినా.. తాను ఎప్పుడూ యువకుడినే అంటూ సరదాగా చెబుతూ ఉంటాడు నటసింహం నందమూరి బాలయ్య. తనకు 16 ఏళ్లే అంటూ ఇంటర్వ్యూలో నవ్విస్తూ ఉంటాడు. వయస్సుకు, పనికి సంబంధం లేదని, ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తూ ఉంటానని చెబుతాడు. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య.. తన మార్క్ మేనరిజం, పవర్‌ఫుల్ డైలాగులతో ఇప్పటికీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తూనే ఉన్నాడు. బాలయ్యకు ఇప్పటికే ఫ్యాన్స్ లో క్రేజ్ అలాగే ఉంది.

బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు బాలయ్య. ద్విపాత్రాభినయంతో అభిమానులను మెస్మరేజ్ చేశాడు. అఘోర పాత్రలో బాలయ్య విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ పాత్రలో బాలయ్య డైలాగ్స్, ఫైట్లు ఫ్యాన్స్ కు పిచ్చెక్కించాయి. సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సినిమాగా అఖండ నిలిచింది.

అయితే అఖండ తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రాక్ తో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని మాస్ హీరో బాలయ్యతో చేస్తున్న సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని కూడా మాస్ డైరెక్టర్ కావడంతో వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా ఇక ఒక రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు పెద్దాయన, అన్నగారు, వేటపాలెం అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సిని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజున టైటిల్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుందని సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తుండగా.. లేడీ విలన్ పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తోంది.

Share post:

Popular