ఆ దర్శకుడిని తిట్టిన శృతిహాసన్.. అసలేం జరిగిందంటే..?

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎంతో మంది హీరోయిన్ లలో శృతిహసన్ కూడా ఒకరు . ఈమె తమిళ చిత్రాలలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న శృతిహాసన్. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసిన ఈమె.. సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సంపాదించుకోగా.. మరికొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి.

ఇకపోతే తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కి మొదటి సక్సెస్ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక దర్శకుడిని శృతిహాసన్ తిట్టింది అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది అంతే కాదు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. విక్రమ్ సినిమా ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. శృతి హాసన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో శృతి హాసన్ తో నేను ఎప్పుడూ కూడా మీ తండ్రి ఎలాంటి డైట్ ఫాలో అవుతారు.. ఏం తింటారు.. దర్శకత్వం చేసే సమయంలో ఎలా ఉంటారు .. ఇంట్లో ఏం చేస్తుంటారు అని పదే పదే అడిగే వాడిని. ఇక ముఖ్యంగా షూటింగ్ గ్యాప్ లో ఇలాంటి విషయాలన్నీ అడుగుతూ ఉండడంతో ఆమె బాగా తిట్టేది అని.. తండ్రి గురించి తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడాలని ఆమె కోరేది అని హరీష్ శంకర్ కామెంట్ చేశారు.

శృతిహాసన్ తో సినిమాలు తీయడం ద్వారా తాను కమలహాసన్ తో సినిమాలు తీసినట్టు భావించానని హరీష్ శంకర్ వెల్లడించారు. ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా తర్వాత ఆమె మరి ఎలాంటి ప్రాజెక్టులో నటించబోతోందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular