ఆ హీరోతో నాలుగోసారి..సమంత స్పీడ్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత..ఏం చేసినా అది హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..నెం 1 హీరోయిన్ స్దానాన్ని సంపాదించుకుని..టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలేస్తూ..ఇండియాలో నే నెం 1 హీరోయిన్ గా అభిమానుల చేత పిలిపించుకుంటుంది. సమంత కేవలం అందగత్తే కాదు.. మంచి టాలెంటెడ్ బ్యూటి. ఏ రోల్ లో అయినా..ఇమిడి పోయి నటించగలదు. లవర్ గా , భార్య గా, ఫ్రెండ్ గా, భామ గా..ఇలా అన్ని రోల్స్ లో నటించి అభిమానులను మెప్పించింది.

కెరీర్ పరంగా అమ్మడు ఓ రెంజ్ లో టాప్ పోజీషన్ లో ఉన్నా..వ్యక్తిగతంగా మాత్రం భార్య బంధాని నిలుపుకోలేకపోయింది. ఎంతో గాఢంగా ప్రేమించి..ఇష్టంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య జంట విడిపోయింది. రీజన్స్ తెలియవు కానీ..అమ్మడు అక్కినేని ఇంటి కోడలు గా ఉండను అని కోడలు పోస్ట్ నుండి తప్పుకుంది. దీంతో అమ్మడు సినిమా కెరీర్ అయిపోయింది. ఇక గుడ్ బై అనుకున్నారు అంత. కానీ, సమంత డబుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ..మంచి మంచి అవకాశాలు కొట్టేస్తుంది.

ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం,యశోద..చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యనే విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కు కమిట్ అయ్యింది. ఓ హాలీవుడ్ మూవీ కి ఇప్పటికే సైన్ చేసిన సమంత ..ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో తో సినిమా కి సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తో సమంత నాలుగోసారి జతకడుతున్నట్లు కోలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం తన 66వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇది అయిన తర్వాత విజయ్ తన 67వ సినిమా లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నాడని..ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే ..సమంత కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.sa

Share post:

Popular