వాళ్ల వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా..సమంత సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్న సమంత ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉంది. క్రేజీ క్రేజీ ఆఫర్లు పట్టేస్తూ ..కుర్ర బ్యూటీలకు సైతం షాకిస్తుంది. ఇప్పటికే సమంత చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి కొన్ని సినిమాలను హోల్డ్ పెట్టిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సమంత విడాకుల తరువాత ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తుంది. సెకండ్ కూడా వృధా చేయకుండా నచ్చిన సినిమాలకి సైన్ చేస్తుంది.

సమంత విడాకులు ప్రకటించగానే అందరు ఆమె సినీ కెరీర్ కి ఖచ్చితంగా మైనస్ అవుతుంది అనుకున్నారు. కానీ , సమంత తన అందాలతో మాయ చేసింది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావ పాటతో పాన్ ఇండియా స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత పై సోషల్ మీడియా లో ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పెళ్ళికి ముందు, పెళ్లి తరువాత కన్నా కూడా..విడాకుల తరువాత అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక్క పోస్ట్ పెట్టడం..దానిపై ట్రోలర్స్..ఘాటుగా ట్రోల్ చేయడం వంటి పనులు చేస్తున్నారు.

ఇక ఇదే విషయాని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుకి వెళ్లిన సమంతని అడగ్గా..ఆమె తన మనసులోని బాధ చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ..”సోషల్ మీడియాలో ఈ మధ్యకాలం లో ఎక్కువ గా ఉంటున్నాని అన్నది వాస్తవమే. నాకు అభిమానులతో మాట్లాడటం..వాళ్ల ఇష్టాలకు తగ్గట్లు సినిమాలు చేయడం ఇష్టం. నాకు సంబంధించిన ఫోటోలని, వీడియోలని..అభిమానులతో షేర్ చేసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ వేరే..మాటల్లో చెప్పలేనిది. హా..అవును..చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు..దారుణంగా మట్లాడుతున్నారు. అలాంటి వాళ్ల వల్ల నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నేను తప్పు చేయనంత వరకు నాకు ఏ బాధ లేదు..నన్ను అభిమానించే ఫ్యాన్స్ కోసం వాళ్లని ఎంటర్టైన్ చేయడం కోసం నా స్దాయిశక్తుల కష్టపడతా..”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Popular