దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్న నయన్.. హనీమూన్ పిక్ వైరల్..!!

కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార..ఇప్పుడు మిసెస్ విగ్నేశన్ శివన్ గా మారిపోయింది. గత కొంత కాలంగా ప్రేమ పావురాలుగా జీవించిన ఈ క్యూట్ లవ్ బార్డ్స్ ఎట్టకేలకు..పెళ్ళి చేసుకుని ఒక్కటైయారు. అస్సలు వీళ్ళు పెళ్ళి జరుగుతుందా లేదా అని లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ నే. ఎందుకంటే నయన్ జీవితంలో లవ్, పెళ్లిలు చాలా వరకు లాస్ట్ లో క్యాన్సిల్ అయిపోయాయి. గతంలో ఆమె నడిపిన ప్రేమ యవ్వారాలు..ప్రభుదేవ తో పెళ్ళి పీఠలు వరకు వెళ్లి వెనక్కి వచ్చేసిన రోజులు మనకు తెలియనవి కావు.

- Advertisement -

అయితే, ఈ ప్రేమ కూడా అక్కడితోనే ఆగిపోతుందనుకున్నారంతా.. కానీ, పెళ్ళి వరకు వెళ్లి..ఇప్పుడు హనీ మూన్ లో బిజీ గా ఉన్నారు ఈ జంట. జూన్ 9 న తమిళనాడు లోని మహాబలిపురంలో..ఓ రిసార్ట్ లో కేవలం బంధుమిత్రులు దగ్గర ఫ్రెండ్స్ సమక్షంలో చాలా సింపుల్ గా ..రాయల్ లుక్ లొ పెళ్లి చేసుకున్న నయన్-విగ్నేశ్..పెళ్లి తరువాత తిరుములకు వెళ్ళి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుని..అక్కడ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఫైనల్ గా సారీ చెప్పి మ్యాటర్ కూల్ చేసిన ..నయన్ పై ఇంకా గుర్రుగానే ఉన్నారు హిందువులు.

కాగా, ప్రజెంట్ భర్త విగ్నేశ్ శివన్ తో హనీ మూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నయన్..వాళ్లకి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తూ..నెట్టింట హీట్ పెంచేస్తుంది. పెళ్లికి ముందు వరకు లిమిట్స్ లో ఉన్న ఈ జంట ..ఆఫ్టర్ మ్యారేజ్..రొమాంటిక్ స్టిల్స్ తో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. మెడలో తాళి బొట్టు ని చూపిస్తూ..విగ్నేస్ తో నయన్ ఫోటోకి ఇచ్చే ఫోజులు..క్యూట్ గా ఆకట్టుకుంటున్నాయి. అయితే, తాజా ఓ రెస్టారెంట్ కి వెళ్లిన ఈ జంట..బాగా ఆకలి ఉన్న నయన్..ఫుడ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ పిక్ లో నయన్ చాలా క్యూట్ గా..హాట్ గా మెడలో తాళి బొట్టుతో కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Popular