మీనా భర్త చనిపోవడానికి కారణం అదేనా..సంచలనంగా మారిన క్లోజ్ ఫ్రెండ్ మాటలు..?

సినీ ఇండస్ట్రీ శోకశంద్రంలో మునిగిపోయింది. గత కొన్ని రోజులుగా వరుస విషాద వార్తలు వింటూ వస్తున్న సినీ ప్రముఖులకు ..మీనా భర్త మరణ వార్త విని గుండె పగిలిన్నట్లైంది. టాలీవుడ్, కోలీవుడ్ లల్లో తన దైన స్టైల్ లో నటించి మంచి మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి కొద్ది టైంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీనా ఇప్పుడు మోయలేని బాధను మోస్తుంది. సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.

- Advertisement -

ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆమె అభిమానులు షాక్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు చక్కగా హ్యాపీగా ఉన్న మీనా భర్త ఇలా సడెన్ గా మృతి చెందటం ఇండస్ట్రీలో షాకింగా మారింది. అయితే ..ఈ ఏడాది స్టార్టింగ్ లో మీనా టోటల్ కుటుంబం కరోనా బారిన పడ్డిందని..అందరు త్వరగా కోలుకున్నా.. విద్యా సాగర్ పై కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడ్డిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అప్పటి నుండి ఆయన ఆరోగ్యం బాగుండటం లేదని.. కరోనా కారణంగా ఉపిరి తిత్తుల సమస్య ఎక్కువైందని..దీని కారణంగా గత కొంతకాలంగా శ్వాస తీసుకోలేక బాధపడుతున్నాడట. అయితే నిన్న రాత్రి ఆ సమస్య ఎక్కువ అవ్వడంతో.. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసిన ఫలితం లేకుండా పోయిందని..హాస్పిటల్ కు వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే ఆయన మృతి చెందారు అని కోలీవుడ్ మీడియా లో ఓ వార్త వైరల్ అవుతుంది.

అయితే, మీనా భర్త మరణానికి కారణం కరోనానే కాదు..పావురాలు కూడా అంటూ ఓ సంచలన మ్యాటర్ వైరల్ గా మారింది. విద్యా సాగర్ క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రముఖ తమిళ మీడియా ఛానెల్ కు ఈ షయాని చెప్పుకొచ్చిన్నట్లు వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. మీనా కాపురం ఉంటున్న ఇంటికి కాస్త దూరంలోనే పెద్ద ఎత్తునపావురాలు ఉంటాయట. ఆ పావురాల వ్యర్థాల నుండి వచ్చిన వాసన వల్లే విద్యాసాగర్ ఊపిరి తిత్తులు చెడిపోయాయని..ఓ న్యూస్ వైరల్ గా మారింది.

Share post:

Popular