లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోతోన్న తెలుగు ముద్దుగుమ్మ‌…!

కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లే చలామణి అవుతున్నారు. అప్పుడప్పుడు అరాకొరా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఇక్కడ ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ విషయంలో పలు వివాదాలు కూడా నడుస్తున్నాయి. తెలుగు సినిమా నేడు ఎల్లలు దాటి అలరిస్తోంది. కానీ సదరు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు మాత్రం కనిపించడం లేదు. ఇక మన మేకర్స్ డిమాండ్ అండ్ సప్లై అనే ఫార్ములా ప్రకారమే హీరోయిన్ లని ఇతర భాషల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దీంతో తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

ఇన్ని కాలిక్యులేషన్స్ మధ్య కూడా కొంతమంది అలా మెరిసి అలా వెళ్లిపోతున్నారు. అయితే గత కొంతకాలంగా ఓ హీరోయిన్ మాత్రం కాస్త ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవడం మనం చూడవచ్చును. ఆమె పేరే చాందిని చౌదరి. అవును… ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతోంది. సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది. ఆమధ్య కోవిడ్ సమయంలో ఆమె నటించిన ‘కలర్ ఫొటో’ ఆహా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసినదే.

ఇక ప్రస్తుతం ఆమె యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా ‘సమ్మతమే’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని షురూ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

పబ్ కల్చర్ కు అలవాటు పడిన అమ్మాయిగా చాందిని చౌదరి ఇందులో కనబడనుంది. అలాంటి అమ్మాయిని ప్రేమించే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించనున్నాడు. విడుదలైన ట్రైలర్ లో ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్ లు స్పష్టంగా కనిపించాయి. అయితే బోల్డ్ క్యారెక్టర్స్ చాందినికి ఏరకంగా ఉపయోగపడతాయో చూడాలి మరి..!

Share post:

Popular