బ్యాచిలర్ లైఫ్ కు బై బై.. పెళ్ళి పీఠలు ఎక్కబోతున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బ్యాచిలర్ వికెట్ పడిపోతుందా…అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, హీరో ..హీరోయిన్లు అందరు వరుసగా..పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్..రానా, నితిన్, నిఖిల్..కోళీవుడ్ హీరో కమ్ విలన్ ఆది పిన్ని శెట్టి..బాలీవుడ్ బ్యూటీ అలియా, కత్రినా..ఇలా బడా బడా బిగ్ స్టార్స్ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలను..అబ్బాయిలను పెళ్లి చేసుకుని..లైఫ్ లో సెటిల్ అయ్యారు.

ఇక ఆ లిస్ట్ లోకే యాడ్ అవ్వబోతున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. యస్..తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం..హీరో రామ్ పెళ్ళి పీఠలు ఎక్క బోతున్నారట. ఆయన పెళ్లి చేసుకోబోయేది..తన క్లాస్ మెట్ ని అని తెలుస్తుంది. గత కొంత కాలంగా లవ్ చేసుకుంటున్న ఈ జంట..ఫైనల్లీ ఇంట్లో ఒప్పించి..ఒక్కటి అవ్వడానికి మూహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రామ్ లింగుస్వామీ డైరెక్షన్ లో “ది వారియర్” అనే మూవీలో నటించాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న రామ్..త్వరలోనే..తన నిశ్చితార్ధం పై అఫిషీయల్ ప్రకటన ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటూ రామ్ సన్నిహితుల దగ్గర నుండి సమాచారం అందుతుంది. “ది వారియర్” సినిమా కంప్లీట్ అవ్వగానే..రామ్ ..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండటంతో..ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ పై పడ్డాయి. మరి చూడాలి..తన పెళ్లి రూమర్ పై రామ్ ఎలా స్పందిస్తారో.?

Share post:

Latest