షాకింగ్: ఆమెలో మ్యాటర్ నిల్.. హీరో నితిన్ హ్యాపీగా లేడా..ఇంత దారుణమైన రూమరా..?

టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ హీరో..ఆ తరువాత మంచి మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..స్టార్ హీరోల లిస్ట్ లొకి చేరిపోయాడు. మొదటి నుండి నితిన్ తన కెరీర్ పై చాలా ఫోకస్ గానే సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్య లో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా..వెంటనే తేరుకుని ..మళ్ళీ పవర్ ఫుల్ హిట్లు అందుకుని ఫాంలోకి వచ్చాడు.

- Advertisement -

అయితే, ప్రజెంట్ నితిన్ హీరో గా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా పై ఓ కొత్త రూమర్ నెట్టింట సంచలనంగా మారింది. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ను కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ సినిమా అయినా కధలో మంచి ఎలివేషన్స్..ఆడియన్స్ కి కావాల్సిన పస అన్ని పుష్కలంగా ఉండేలా స్టోరీ మార్చుకున్నారట. అయితే, ఈ సినిమాలో హీరోయిన్లు గా లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా నటిస్తున్నారు. సినిమాలో కేథరిన్ థెరిస్సా రోల్ చాలా చిన్నది అని..ఆమె సెకండ్ హీరోయిన్ ఫాంలో తెర పై కనిపిస్తుందనే టాక్ బయటకు వచ్చింది.

కాగా, ఈ సినిమాలో కృతి పర్ ఫామెన్స్ పట్ల నితిన్ అసహనంగా ఉన్నారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ లతో పోలిస్తే..కృతి ఈ సినిమాలో పర్ ఫామెన్స్ వైస్ డల్ గా కనిపిస్తుందట. కృతి పర్ ఫామెన్స్ విషయంలో నితిన్ హ్యాపీగా లేడు అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ముఖ్యంగా కృతి-నితిన్ మధ్య వచ్చే సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రేషన్స్ అనుకున్న స్దాయిలో లేవని..కధకి వాళ్లే మెయిన్ లీడ్ అని..దీంతో మళ్లి కృతి-నితిన్ పై కొన్ని సీన్స్ ని రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు అలా సీన్స్ రీషూట్ చేయడానికి బడ్జెట్ లిమిట్ క్రాస్ చేసేసిందని టెన్షన్ పడుతున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాని నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌నే తెర‌కెక్కిస్తోంది. ఓవర్ ఆల్ గా సినిమా కి ముందు అనుకొన్న బ‌డ్జెట్ కంటే 30 శాతం ఖ‌ర్చు పెరిగిపోయిన్నట్లు తెలుస్తుంది.

Share post:

Popular