నేచురల్ స్టార్ నాని ఫేస్ బుక్ ప్రేమ కథ.. కట్ చేస్తే..!!

నాచురల్ స్టార్ నాని ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాని.. ఇప్పుడు సరికొత్త కాన్సెప్టుతో అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించటానికి సిద్ధమయ్యాడు. ఇక ఇందులో టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా.. నాని తో జతకట్టిన విషయం తెలిసిందే.

ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మల్టీప్లెక్స్లో బుకింగ్స్ బాగానే ఉన్నా.. సింగిల్స్ స్క్రీన్ లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని స్పష్టం అవుతోంది. ఇదిలా ఉండగా నాని భార్య గురించి అతని ప్రేమ గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని.. ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని తన భార్య కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు.

నాని మాట్లాడుతూ తన ప్రేమ కథలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని.. కానీ తన భార్య అంజనా తరపు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తనకు అంజనను ఇచ్చి పెళ్లి చేయాలంటే కొంచెం టెన్షన్ పడ్డారు అని కూడా తెలిపారు. నిజానికి అంజన బ్యాక్గ్రౌండ్ సైంటిస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ అని.. ఇక తన పెళ్లి సమయంలో హీరోగా కెరీర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని కామెంట్లు చేశారు. కానీ అంజనా వల్లే ఆయన కుటుంబసభ్యులు తనను చూసిన తర్వాత మరో ఆలోచన చేయకుండా పెళ్లి చేసారట.

ఇక ఫేస్బుక్ ద్వారా తనకు అంజనా తో పరిచయం ఏర్పడి.. అలా కొంతకాలానికి ప్రేమగా మారింది.. తర్వాత ఇరువురు కుటుంబీకుల మధ్య ఘనంగా వీరి వివాహం జరిగింది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటలలో నాని – అంజన జంట కూడా ఒకటి.

Share post:

Popular