అడవి శేష్ ‘ మేజర్ ‘ సినిమా గురించి ఈ 9 సీక్రెట్లు మీకు తెలుసా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ లో యువ హీరోగా తన సత్తా చాటుతున్న హీరోలలో అడవి శేష్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈయన నటించే ప్రతి పాత్ర కూడా చాలా విభిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో బయోపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).26/11 ఉగ్రదాడులలో పౌరుల ప్రాణాలను కాపాడుతూ మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అయితే సందీప్ ఎలా చనిపోయారో తెలుసా కానీ తన జీవితాన్ని ఎలా జీవించాలో తెలియని విషయాలని ఎంతో చూపించాలని ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తీశారు అడవి శేష్.

2). డైరెక్టర్ శశికిరణ్ తిక్క అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో కూడా గూడచారి వంటి సినిమా తెరకెక్కించారు.

3). ముందుగా ఈ సినిమా టైటిల్ ని మేజర్, మేజర్ సందీప్.. అనే టైటిల్ ని పెట్టాలి అనుకున్నారట. కానీ చివరిగా మేజర్ అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ సినిమాను తీసేందుకు అనుమతి తీసుకున్నారు.

4). ఈ చిత్రాన్ని నిర్మాత అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రుడు ఈ చిత్రాన్ని.. మహేష్ బాబు వినిపించగా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఇలాంటి చిత్రంలో భాగస్వామ్యం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని పలు సార్లు తెలియజేశారు.

5). ఈ సినిమా కోసం 120 రోజులు సమయం పట్టిందట.. అంతేకాకుండా 75 పైగా లొకేషన్ లలో 8 అత్యధిక భారీ సెట్లు వేసినట్లుగా సమాచారం.

6). మేజర్ సినిమాని నగరాలలో కొంతమంది ప్రేక్షకుల కోసం ఈ సినిమాని ప్రదర్శించడం జరిగింది. విడుదలకు ముందే ప్రేక్షకుల కోసం ఒక సినిమాను ప్రదర్శించడం ఇదే మొదటిసారి.

7). 2008వ సంవత్సరంలో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు మేజర్ సందీప్ గురించి అడవి శేషు ఎన్నో విషయాలను తెలుసుకున్నారట. ఇక ఆయనను చూడగానే తన అన్నలా భావించిన అప్పటి నుంచి మేజర్ సందీప్ సమాచారాన్ని సేకరిస్తున్నారు అడవి శేషు.

8). మేజర్ సందీప్ గురించి పలు విషయాలు తెలుసుకునేందుకు అడవిశేష్ ఆయన తల్లిదండ్రులను కూడా కలిశాడు. ఇక వారితో కలిసి ప్రయాణం కూడా చేశారు. కొన్ని రోజులు అయిన తర్వాత సందీప్ తండ్రి మాట్లాడుతూ.. నువ్వు మా అబ్బాయి సినిమా తీయగలవని 10% నమ్మకం మాత్రమే కలిగిందని అనడంతో అందరూ నవ్వేశారట.

9). చివరిగా సందీప్ కిషన్ ఎప్పుడూ చెప్పే మాట మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు నిశబ్దం తప్ప ఇవి రెండు చాలా ముఖ్యం అని చెబుతూ ఉండేవాడట.