టీడీపీతో ట‌చ్‌లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవ‌రు ?

వాస్త‌వ అవాస్త‌వాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేత‌లు ఈ న్యూస్‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు ప్ర‌తిప‌క్ష టీడీపీకి ట‌చ్‌లోకి వెళ్లిపోయార‌ట‌. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీడీపీతో టచ్ లో ఉన్నారనేది ఆయన మాట. అంతే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాక‌ర్ రెడ్డి గ‌తంలో టీడీపీ నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న పేరు అనుకుంటే ఎమ్మెల్యేల్లో ఖ‌చ్చితంగా ఆనం రామనారాయ‌ణ రెడ్డితో పాటు మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి ఉన్నారంటూ వారి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఇక ఎంపీల్లో ఆదాల కాకుండా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు కూడా టీడీపీ ట‌చ్‌లో ఉన్న లిస్టులో ఉంద‌ని టీడీపీ వాళ్లు చెపుతున్నారు. ఆయ‌న కూడా గ‌తంలో టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవ‌డంతో పాటు టీడీపీలో ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఇక ఆయ‌న్ను అస్స‌లు వైసీపీ వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు కూడా టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదే న‌ర‌సారావుపేట నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. వీరితో పాటు వైజాగ్ ఎంపీ ఎంవీవీ. స‌త్య‌నారాయ‌ణ కూడా వైసీపీలో ఇమ‌డ లేక పాత ప‌రిచ‌యాల‌తో టీడీపీ వైపు చూస్తున్నార‌ట‌. అయితే వైసీపీ వాల్లు మాత్రం ఇదంతా ఫేక్ ప్ర‌చారం అని ఖండిస్తున్నా… టీడీపీ వాళ్లు బాగా వైర‌ల్ చేస్తున్నారు.

Share post:

Popular