ఇలా చేసి ఏం సందేశం ఇస్తున్నావ్.. జ‌గ‌న్‌కు డైరెక్ట్ క్శ‌శ్చ‌న్‌…!

తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ తీవ్ర‌మైన క‌ల‌క‌లం రేగుతోంది. అస‌లు జ‌గ‌న్ ఉద్దే శం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసి పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఎందుకంటే.. అటు ఎమ్మెల్సీ టికెట్లు కానీ, ఇటు రాజ్య‌స‌భ స్థానాలు కానీ.. జ‌గ న్ ఇస్తున్న తీరు.. నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. పార్టీలో ఆది నుంచి ఉండి.. జ‌గ‌న్ కోసం.. జెండాలు ప‌ట్టుకుని.. రోడ్డు ఎక్కిన నాయ‌కులు చాలా మంది ఉన్నారు.

అంతేకాదు.. ఆస్తులు అమ్ముకుని.. మ‌రీ జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల్లో ఉన్న ప‌ద‌వులు కూడా వ‌దులు కుని వ‌చ్చారు. వీరంతా కూడా వైసీపీ కోసం.. మ‌న‌సుపెట్టి ప‌నిచేశారు. వీరం కూడా జ‌గ‌న్‌కు న‌మ్మిన బ‌ట్లు గా ఉన్నారు. అంతేకాదు.. చాలా మం ది నాయ‌కులు.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా త్యాగం చేశారు. అయితే.. మూడేళ్లు గ‌డిచినా.. వీరిని జ‌గ‌న్ ప‌ట్టించుకున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు.

పైగా.. రాష్ట్రంలో ఉన్న ప‌ద‌వులే త‌క్కువ (పార్ల‌మెంటుకు సంబంధించి) అలాంటి ది వ‌చ్చిన అవ‌కాశాల ను కూడాపార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి కాకుండా.. బ‌య‌ట వారికి ఇవ్వ‌డం.. పార్టీతో సంబంధం లేనివారిని ఎంపిక చేయ‌డం.. అసలు పార్టీలో స‌భ్య‌త్వం కూడా లేని వారిని ఎంపిక చేయ‌డం.. వంటివి ప్ర‌ధానంగా విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. అంతేకాదు.. తెలంగాణకు చెందిన ఆర్‌. కృష్ణ‌య్య‌కు ఇప్పుడు అవ‌కాశం ఇవ్వ‌డం మ‌రీ దారుణ‌మ‌ని.. వైసీపీ సీనియ‌ర్లు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న జ‌గ‌న్‌.. పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సందేశాలు ఇస్తున్నార‌నేది ప్ర ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే..రేపు పార్టీని గెలిపించాలంటే.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులే ప‌నిచేయాలి. అంత‌కుమించి.. ఇప్పుడు కొత్త‌గా తెచ్చుకున్న ప‌రిమ‌ళ్ న‌త్వానీ కానీ, ఆర్‌. కృష్ణ‌య్య కానీ.. ఏమేర‌కు హెల్ప్ చేస్తారు? అనేది సీనియ‌ర్ల మాట‌.

“రేపు మాతో అవ‌స‌రం లేదా? క‌నీసం.. ఎవ‌రినైనా సంప్ర‌దించే ఈ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా? లేక జ‌గ‌న్ త‌న సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా?“ అని నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం చెబుతారో చూడాలి.

Share post:

Popular