ఆచార్య ఎక్కడ దెబ్బేసింది..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్యపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ కావడానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా నటిస్తుండటం. దీంతో ఏప్రిల్ 29 నుండి థియేటర్లలో టాప్ లేచిపోతుందని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఆచార్య సినిమాకు తొలిరోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో వీకెండ్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ వసూళ్లతో సాగింది. ఓవరాల్‌గా వారం రోజుల్లోనే ఈ సినిమాను థియేటర్ల నుండి ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అసలు ఇంతటి భారీ క్యాస్టింగ్, సక్సెస్‌ఫుల్ టెక్నీషియన్లు పనిచేసిన ఆచార్య ఎందుకు ఫ్లాప్ అయ్యిందనే విషయాన్ని పరిశీలిస్తే.. ఈ సినిమా ప్లాట్ లోనే లోపం అంతా కనిపిస్తుంది.

గతంలో ఓ ఈవెంట్ లో దర్శకుడు తేజ చెప్పినట్లుగా ఇది పాతకాలం బాబు గారి కథలాగే ఉంది. రొటీన్ రొట్టకొట్టుడు కథను స్టార్‌డమ్‌తో కవర్ చేసి ప్రేక్షకులను మేనేజ్ చేయొచ్చని చూసిన ఆచార్య టీమ్‌కు చుక్కెదురైంది. ఇలాంటి సినిమాలకు నూకలు లేవని తెలుగు ప్రేక్షకులు తేల్చిచెప్పేశారు. మరి గొప్పలకు పోకుండా ఇప్పటికైనా మెగా కాంపౌండ్ ఆచార్య డిజాస్టర్‌ను ఒప్పుకుంటారో లేదో చూడాలి.