అసలు నాగార్జునకి ఏమైంది … ఎందుకు అలా ఉన్నారు…?

టాలీవుడ్ లో గత నాలుగు దశాబ్దాలుగా మన్మథుడిగా తన స్థాయిని చాటుతో వచ్చాడు. ఒకప్పుడు తన తోటి అగ్ర హీరోలకు పోటీ గా సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన అక్కినేని నాగార్జున… ఇప్పుడు తన కొడుకు వయసు ఉన్న యంగ్ హీరోలకు కూడా పోటీ ఇచ్చేందుకు అదే స్థాయి సినిమాలతో అలరిస్తున్నాడు. నాగార్జున తన సినిమా కెరీర్ లో హీరోగా, నిర్మాతగా, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో కి హోస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఇంత వయసు వచ్చినా తన మొహంలో మాత్రం ఆ తేజస్సు, అందం మాత్రం తగ్గలేదు. సరికదా రెట్టింపు అందంతో అమ్మాయిల మనసులో మన్మథుడిగా ఉన్నాడు. ఇటీవల బంగార్రాజు సినిమాతో నాగచైతన్యతో మల్టీ స్టారర్ మూవీలో అదరగొట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

ఇదిలా ఉంటే, తాజాగా నిన్న జరిగిన యాంకర్ సుమ మూవీ “జయమ్మ పంచాయితీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగార్జున ఒక అతిధిగా విచ్చేశాడు. అయితే ఎందుకో తెలియదు కానీ… తన లోక్, హావభావాలు, మాట్లాడిన విధానం తేడాగా ఉంది. ఇంతకు ముందులా ముఖంలో మెరుపు లేదు. మాటల్లో పవర్ లేదు, టోటల్ గా మన్మధుడు నాగార్జునలో ఎటువంటి హుషారు లేదు. దీనితో నాగార్జున అభిమానులు అంతా కంగారు పడుతున్నారు. అసలు కింగ్ నాగార్జునకు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున ఎందుకు అలా ఉన్నాడు అనే దాని గురించి కొన్ని విషయాలు వినబడుతున్నాయి. అందులో నాగార్జునకు వయసు మీదపడుతుండడంతో అలా ఉన్నాడని, పైగా సినిమాల్లో మేకప్ ప్రభావంతో కొంచెం తాజాగా కనబడుతాడు కానీ… ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి ఇలాగె న్యాచురల్ గా ఉన్నాడని..అంతే కానీ దీనికి వేరే సందేహాలు అవసరం లేదని, ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉన్నారని అంటున్నారు.

మరి కొందరు ఇండస్ట్రీ లో పోటీ ఎక్కువైందని, ఈ రకమైన పోటీలో తన బిడ్డలుగా ఇండస్ట్రీలో ఉన్న నాగచైతన్య మరియు అఖిల్ లు కెరీర్ గురించి కంగారు పడుతున్నారని అంటున్నారు. నాగ చైతన్య మూవీ కెరీర్ గురించి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, తాను ఎలాగయినా మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా పిల్ల పాపలతో గడపాలని కోరుకుంటున్నారు. అదే విధంగా సినిమా కెరీర్ గురించి అయితే అఖిల్ గురించి చాలా కంగారు పడుతున్నాడట నాగార్జున. అందుకే దీని గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోయాడని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఇవి కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.