“అర్జున్ రెడ్డి” లవర్ ప్రీతికి ఏమైంది అసలు..?

టాలీవుడ్ లో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేమకథలుగా వచ్చి విరాజయాలను అందుకున్నాయి. అదే విధంగా డెబ్యూ డైరెక్టర్ సందీప్ వంగ విజయ్ దేవరకొండ తో తీసిన సినిమా అర్జున్ రెడ్డి. మొదటగా ఈ సినిమా గురించి పెద్దగా ఎవరో పట్టించుకోలేదు. కానీ రిలీజ్ అయ్యాక మొదటి షో నుండి అందరినీ ఆకట్టుకుని హిట్ అయింది. ఇందులో అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ చాలా న్యాచురల్ గా నటించి చంపేశాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవిలో వస్తే అందరూ టీవీలకు అతుక్కుపోతారు, అంతలా అలరించింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా అంటే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది ఇందులో ప్రీతి పాత్రలో నటించిన హీరోయిన్ షాలిని పాండే అని చెప్పాలి. ఈమెకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా కూడా ఎంతో పరిణతి చెందిన దానిలాగా నటించి అందరినీ మెప్పించింది.

ఇక విజయ్ తో నటించిన రొమాంటిక్ సీన్ లలో అయితే రెచ్చిపోయింది అని చెప్పాలి. ఇందులో హీరో హీరోయిన్ ల నటన సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచింది. అప్పటి వరకు విజయ్ దేవరకొండ కెరీర్ ఒక ఎత్తు, ఈ సినిమా తర్వాత మరో ఎత్తు అని చెప్పాలి. ఈ సినిమాతో యువతకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ జీవించాడు.. ప్రతి సీన్ కూడా ఎంతో రియలిస్టిక్ గా యువతను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ షాలిని పాండే కు ఈ సినిమా తర్వాత గొప్పగా అవకాశాలు ఏమీ రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవి అంతగా ఆదరణ నోచుకోకపోవడంతో ఈమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.


మరి షాలిని ఏమనుకుందో తెలియదు కానీ… ఈ సినిమాలో ఈ పాప లిప్ లాక్ సీన్ లతో రెచ్చిపోయింది. దానితో యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. అయితే చాలా మంది హీరోయిన్ లలాగానే ఈమెకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి.. ఇక బిజీ గా మారిపోతుందని అనుకున్నారు. అయితే ఈమె విష్యంలో అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అని చెప్పాలి. కీర్తి సురేష్ కు ఘనవిజయాన్ని అందించిన మహానటి సినిమాలో నటించినా షాలిని కి గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం చూస్తే శాలిని పాండే లుక్ కూడా పూర్తిగా మారిపోయింది. అర్జున్ రెడ్డి లో కొంచెం బొద్దుగా ఉన్న శాలిని ఇప్పుడు వర్క్ అవుట్ లు చేసి స్లిమ్ గా మారిపోయింది. ఇందుకు సాక్ష్యాలే ఈమె సోషల్ మీడియాలో ఈమధ్యనే పోస్ట్ చేసినా ఫోటోలు. ఈ ఫోటోలు చూసిన వారంతా అదేంటి ప్రీతి ఇంతలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.

Share post:

Popular