సిగ్గు లేదా..వెధవ.. హీరోని గెట్ అవుట్ అంటూ యాంకర్ అరుపులు..!!

వాట్.. నిజమా..ఆ హీరోని యాంకర్ అంత మాట అనేసిందా..?..అందరు ఇప్పుడు ఇదే విషయమై చెవులు కొరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా తీయ్యడం ఏమో కానీ..వాటిని ప్రమోట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు హిరోలు. సినిమాలు తీసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా.. ఆ సినిమాకి పబ్లిసిటీ కూడా ఇవ్వాళి . ప్రమోషన్స్ లో పాల్గొనాలి. పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళ సినిమాలని వాళ్ళకు నచ్చిన విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక చిన్న హీరోలు అయితే ఎక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కి ఖర్చు చేయలేక..ప్లాన్ బి వర్క్ అవుట్ చేస్తున్నారు.

హీరో విశ్వక్‌ సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన స్టైల్ లో ముందు కెళ్తూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో నే ఆయన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమా చేస్తున్నాడు. విద్యాసాగర్‌ చింత డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. రిలీజ్ అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ టీం.. ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీ గా ఉంది. అందరిలా మనం చేస్తే వింత ఏముంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ప్రమోషన్స్ ని కూసింత ఢిఫరెంట్ గా ట్రై చేశారు. అది కాస్త ఫ్లాప్ అయ్యి..ఇప్పుడు సినిమాకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.

ప్రమోషన్స్‌ లో భాగంగ చిత్ర బృందం ఓ ప్రాంక్‌ వీడియో చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్‌ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై కాసేపు టెన్షన్ పెట్టే న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారు హీరో. ఏదో ఊహించుకుంటే ఇంకెదో జరిగింది అన్నట్లు ..ప్రమోషన్స్ బజ్ కోసం ఇలా చేస్తే అది కాస్త పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ప్రమోషన్స్ కోసం ఇంత నీచం గా చేస్తావా అంటూ హీరో పై నెటిజన్స్ మండిపడుతున్నారు . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్‌ సేన్‌పై అరుణ్‌ కుమార్‌ అనే అడ్వకేట్‌ HRC లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీని పై హీరోని డిబెట్ కి పిలిచింది ఓ ప్రముఖ టీవీ ఛానెల్. సరే అంతా బాగా అయిపోతుందిలే అనుకుంటున్న టైంలో సడెన్ గా ఆ డిబేట్ లో ప్రముఖ యాంకర్ , హీరోను ఇలాంటి పనులు ఎలా చేస్తారు.. మీరు పాగల్ సేన్ , డిప్రెస్డ్ పర్సన్ అంటూ మాట్లాడింది. దీంతో విశ్వక్‌ సేన్‌ కు కోపం వచ్చింది. మీరు నన్ను పాగల్ ఎలా అంతారు. నాకు ఎలాంటి పిచ్చి లేదు. నాకు పిచ్చి అని చెప్పిన డాక్టర్ ఎవరు ఇలా రమ్మనండి అంటూ కేకలు పెట్టారు. దీంతో యాంకరమ్మ కూడా అరుస్తూ..గెట్ అవుట్ మై స్టూడియో అంటూ గట్టిగట్టిగా అరుస్తూ చెప్ప్పుకొచ్చింది. కోపం పీక్స్ కు వెళ్లిన విశ్వక్‌ సేన్‌ విరుచుకుపడుతు అభ్యంతరకర(ఎఫ్‌.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన యాంకర్..హీరోను వెధవ అని తిడుతూ నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరవడం సంచలనంగా మారింది. అయితే కొందరు ఇది కూడా ప్రమోషన్స్ లో భాగమనే అంటున్నారు. సినిమాకోసం పబ్లిసిటీ చేసుకోవాలనే సదరు టీవీ ఛానెల్ తో ఇలా కుమ్మకై ..ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Share post:

Popular