ఇంట్రెస్టింగ్: మనిషిని నమ్మిన త్రివిక్రమ్ ఫెయిల్..మనిషిని మార్చిన కొరటాల పాస్… !!

టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి, డైరెక్టర్ కొరటాల శివకి మంచి పేరుంది. ఇద్దరు తమ స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ..విజయాని అందుకుంటున్నారు. ఇద్దరికి ఆల్ మోస్ట్ ఆల్ సేమ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సినీ ఇండస్ట్రీలో పరిచయాలు కూడా అలానే ఉన్నాయి. కానీ ఓ విషయం లో మాత్రం ఇద్దరికి వేరు వేరు ఎక్స్ పీరియన్సెస్ అయ్యాయి. దీంతో మాటల మాంత్రికుడు ప్లాన్ ఫెయిల్ అవ్వగా..కొరటాల తెలివితేటాలు సక్సెస్ అయ్యాయి.

రీసెంట్ గా కొరటాల తెరకెక్కించిన మూవీ..ఆచార్య. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమాలో కధలేదు అని కొందరు..యాక్టింగ్ బాగోలేదు అని కొందరు..హీరోయిన్ లేదు అని మరి కొందరు కామెంట్స్ చేశారు. కానీ అందరు కామన్ గా చెప్పిన పాయింట్ సినిమాలో మ్యూజిక్ దొబ్బెసింది. అస్సలు బాగోలేదు.. డల్ ఫినిష్ అంటూ మణిశర్మ మీద కంప్లైంట్స్ ఇచ్చారు. దీంతో కొరటాల తన నెక్స్ట్ సినిమా తారక్ కి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని పిలిపించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన NTR30మోషన్ టీజర్ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఆకట్టుకుని పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ ని కలిగించింది.

అయితే, ఇదే అనిరుధ్ ని నమ్ముకుని పవన్ తో తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మనకు తెలిసిందే. కధ విషయం పక్కన పెట్టినా..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం డల్ అయిపోయింది.పవన్ లాంటి స్టార్ హీరో కి అంత సాగ తీసిన మ్యూజిక్ సరిపడలేదు. దీంతో అనిరుధ్ కెరీర్ లో భారి డిజాస్టర్ సినిమా పడింది. ఇదే విషయాని పరిశీలించిన విశ్లేషకులు..త్రివిక్రమ్ దే తప్పు అంటున్నారు. అతడికి తెలుగు రాదు..సిట్యువేషన్ ని అతనికి అర్ధం అయ్యేలా వివరిస్తే మ్యూజిక్ బాగా అందించేవాడని, ఇది వరకు కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాడని..ఇప్పుడు తారక్ సినిమా కి మ్యూజిక్ ఇరగదీశాడని..అంటున్నారు. సో, ఈ విధంగా చూసుకుంటే..అనిరుధ్ ని నమ్మి త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడు. అదే అనిరుధ్ ని నమ్మిన కొరటాల..పరిస్ధితి వివరించి అతనికి అర్ధమైయేలా చెప్పి..తన సినిమా కోసం అనిరుధ్ ని మార్చేసి..సక్సెస్ అయ్యాడు. మోషన్ టీజర్ లో మ్యూజిక్ వింటుంటే..సినిమా లో ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Share post:

Popular