సీనియ‌ర్ ఎన్టీఆర్ స‌క్సెస్ వెన‌క ఆ ఒక్క‌డు ఎవ‌రో తెలుసా…!

ప్రతి ఒక్కరి జీవిత విజయం వెనుక తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు విజయం వెనక కూడా ఒకరు ఉన్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఎవరు ఆ వ్యక్తి అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.. స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులలో.. రాజకీయాల ద్వారా ప్రజల మనసులను దోచుకున్న మహనీయుడు అని చెప్పవచ్చు. ఇక తన నటన తో.. సేవాగుణం తో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారకరామారావు.

సాంఘిక, పౌరాణిక, జానపద వంటి ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా కృష్ణుడిగా, రాముడిగా , యముడిగా కూడా ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ రావు అన్నదమ్ములైనా కూడా వీళ్లిద్దరు రామలక్ష్మణులా ఉండేవారు అని చాలా మంది చెబుతుంటారు. ఇక రామారావు, త్రివిక్రమరావు మధ్య మూడు సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉన్నా.. తమ్ముడు అంటే సీనియర్ ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం కూడా ఉండేది.

ఇక త్రివిక్రమరావు కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ చూపించే వారు.అలా ఒకరు ఏదైనా విషయాన్ని ఆలోచిస్తే మరొకరు ఆ విషయాన్ని ఆచరణలో పెట్టే వారు. అంతలా వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ బి.ఏ వరకు చదువుకోగా..త్రివిక్రమరావు మాత్రం ఏమీ చదువుకోలేదు. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ తొలి రోజుల్లో అవకాశాలు రాలేదు. కానీ నైతికంగా బలం ఇచ్చి త్రివిక్రమరావు ప్రోత్సహించారు. ఇక ఆస్తిలో తన వాటాను కూడా తమ్ముడికి రాసిచ్చి తమ్ముడికి పెళ్లి లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఎన్టీఆర్ చూసుకున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి ఎంత మొత్తం ఖర్చు చేసేవారో.. తన తమ్ముడు కుటుంబానికి కూడా అంతే స్థాయిలో ఖర్చు చేసేవారు. ఇక 1996లో ఎన్టీఆర్ కన్నుమూయగా.. 1998లో త్రివిక్రమరావు మరణించారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదిగి సక్సెస్ అవడానికి కారణం ఆయన తమ్ముడు త్రివిక్రమరావు అని చెప్పవచ్చు.

Share post:

Popular