“సర్కారు వారి పాట” సినిమా హిట్టా..ఫట్టా..?

ఫైనల్లి కోట్లాది మంది అభిమానుల కల నెరవేరిచిన రోజు ఇది. మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ గత మూడేళ్లు గా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా..”సర్కారు వారి పాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్, జీ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ వారు ఈ సినిమా సమ్యుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నదియ, శౌమ్య మీనన్, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, మహేశ్ మంజ్రెకర్, రవి ప్రకాశ్, సత్యం ప్రకాశ్ తదితరులు నటులు నతించారు.

ఇక సినిమా విషయానికి వస్తే…సీన్ స్టార్ట్ అవ్వడమే యాక్షన్ తో మొదలవుతుంది. మహేస్ తండ్రి కి లాస్ట్ మిగిలింది ఒక్క రూపాయే..దానినే చేతిలో పట్టుకుని సినిమా నడిపించాడు పరశూరామ్. అనివార్య పరిస్థితుల వల్ల కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్లతో మహేశ్ బాబు తండ్రి తన ఇంటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. సీన్ కట్ చేస్తే భారీ యాక్షన్ సీన్ తో మహేశ్ ఎంట్రీ ఫారిన్ లో ఉంటుంది. సూపర్ అని చెప్పలేం కానీ..అభిమానులను అలరిస్తుంది ఎంట్రీ సీన్. అప్పుడే పెన్ని పాట ఉంటుంది. ఈ సినిమాలో మహేష్ లుక్స్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా అమ్మాయిలకు నచ్చేస్తాడు.

ఇక మహి ఫైనాన్సియల్ కార్పొరేషన్ అనే ఒక ఫైనాన్స్ షాపును నడుపుతుంటాదు మహేశ్. ఇచ్చిన డబ్బును రాబట్టడం లో ధిట్ట. ఇక్కడ కొంచెం సేపు కామెడీతో నవ్వించాడు డైరెక్టర్. ఇక బిజినెస్ లో భాగంగానే అనుకోని విధంగా కీర్తి సురేష్ ను కలుస్తాడు. ఆ పరిచయం ప్రేమ గా మారి..కళవాతి సాంగ్ కు దారితీస్తుంది. అయితే, సడెన్ గా అనుకోని పరిణామంతో కళావతి తో గొడవ పడి ఇండియాకి వచ్చేస్తాడు మహేశ్. సీన్ కట్ చేస్తే, తన తండ్రి పరిస్ధితి చూసిన మహేశ్ ఏం చేస్తాడు..? కళావతి తో గోడవ ఎందుకు..? కళావతికి విలన్ కి సంబంధం ఏమిటి,,? మహేశ్ చేతిలో తాళాల గుత్తి కధ ..ఏంటి..? అనేదే సినిమా స్టోరి.

సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ..సినిమా బాగుంది. అంత వరకే చెప్పగలం. సినిమాకి మెయిన్ హైలెట్ పాయింట్స్..డైరెక్షన్, పాటలు, లవ్ ట్రాక్, మహేశ్ నటన. మైనస్ పాయింట్లు.. పాత కధే, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టించారు, మహేశ్ ను ఇంకొంచెం వాడుకుని ఉండచ్చు. ఓవర్ ఆల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే..యాక్షన్ రివేంజ్ డ్రామా కధని తన స్టైల్ లో తెరకెక్కించి మెప్పించాడు పరశూరామ్. ఒక్కడు , పోకిరి లాంటి సినిమా కాదు కానీ, పర్లేదు..ఓసారి చూడచ్చు ..మహేశ్ కెరీర్లో మరో హిట్ పడిందని చెప్పవచ్చు.