వావ్: ఆ విషయంలో దేశంలోనే నెం 1 హీరోయిన్ సమంత..!!

సమంత..ఓ అందాల కుందనపు బొమ్మ. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే స్మైల్..ఆమెకు అభిమానులు అయ్యేలా చేస్తుంది. కేవలం అందమే కాదు నటనలోను ఆమె అన్ని విధాల పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఏ మాయా చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు..ఆ సినిమాతోనే కుర్రాళ్లను మాయలో పడేసింది. ఇక అప్పటి నుండి ..ఇప్పుడు వరకు ఆమె కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది కానీ..తగ్గట్లేదు.

సమంత హీరోయిన్ గా మొదటీ సినిమతోనే ప్రూవ్ చేసుకుంది. ఇక ఆ తరువాత ఆమె ఢిఫరెంట్ స్టైల్స్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటూ..ఆమెలోని టాలెంట్ ని అందరికి తెలిసేలా చేసింది. ముఖ్యంగా ఓ బేబీ సినిమా, మజిలీ మూవీ, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరిస్..ఈ సిరీస్ లో రాజీ పాత్రలో జీవించేసింది. టాప్ స్టేటస్ ఉన్న హీరోయిన్ ఇలాంటి పాత్రలు చేయరు..కానీ సమంత చేసి చూపించింది. ఈ పాత్రకు ఆమె ఎన్నో అవార్డులు సైతం విన్ అయ్యింది.

కాగా, సమంత నటనకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు..ఏకంగా మన ఇండియా లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటే అందరు సమంత కే ఓటు వేశారు. దీంతో మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్ గా సమంత ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక రెండో స్దానంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, మూడో స్దానంలో నయనతార ఉన్నారు. దీంతో సమంత అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పుతూ విష్ చేస్తున్నారు.

Share post:

Popular