ఇదే ఫైనల్ వార్నింగ్..పాన్ ఇండియా రౌడీ ‘వారియర్’ కుమ్మేశాడ్రా బాబు….!!

వావ్..ఊర మాస్ లుక్ లో అదరకొట్టేశారు..ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. యస్.. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మూవీ “వారియర్”. ఇప్పటివరకు మనం చూసిన రామ్ వేరు..ఈ సినిమా లో మనం చూడబోయే రామ్ వేరు అని టీజర్ బట్టే అర్ధమైపోతుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు లింగు స్వామి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. లేటేస్ట్ హాట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది వారియర్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో రామ్ సిన్సీయర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. ఇప్పటివరకు రామ్ ఏ సినిమాలోను పోలీస్ లుక్ లో కనిపించలేదు. దీంతో రామ్ మొదటి సారి పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు జనాలు. కాగా రేపు అనగ 15 మే ఈ మాస్ హీరో పుట్టిన రోజు. ఈ సంధర్భంగా ముందే ఆయన కు బర్త డే విషేశ్ చెప్పుతూ..వారియర్ టీం..సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

కాగా, కొద్ది సేప్పటి క్రితమే రిలీజ్ అయిన ఈ టీజర్..యమ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా లో రామ్ చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.” పాన్ ఇండియా సినిమాలు చూసి వుంటారు. కానీ ఎప్పుడైన పాన్ ఇండియా రౌడీలను చూసారా?..అంటూ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఇక సినిమా నదియా ఎంతో ఎమోషనల్ గా..రామ్ తో ..”వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు..వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం” అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పుతుంది. ఇక సినిమా లో కృటి శెట్టి టూ హాట్ అందాలతో ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలా మనకు చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది.

అంతేకాదు.. ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్..ఆదిపినిశెట్టి. పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి ఊర మాస్ లుక్స్ అద్దిరిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్క అని తెలిసిపోతుంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

Share post:

Latest