“సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా ?

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన క్షణాలు మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి. అప్పుడెప్పుడో సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టిన మహేశ్ ఇప్పటి వరకు తెర పై కనపడలేదు. దీంతో మే 12న రిలీజ్ కాబోతున్న ఆయన హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారు పాట” పై బోలెడు అంచనాలను పెట్టుకుని ఉన్నారు అభిమానులు. పైగా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. కామెడీ ఎంటర్ టైనర్ అని అర్ధమైపోయింది. ఇక సినిమా లో మహేష్ చెప్పే డైలాగ్స్ కూడా బాగా హైలెట్ గా నిలిచాయి.

ముఖ్యంగా సినిమాలో అటూ క్లాస్ ఇటు మాస్ రెండింటిని మెనేజ్ చేస్తూ మహేశ్ మంచి ఆకలి మీద ఉన్న తన అభిమానులకు ఫుల్ మీల్ పెట్టేశాడు. ఈ సినిమా ని డైరెక్టర్ పరశూరాం తన స్టైల్ లో మహేశ్ అభిమానులకు తగ్గట్లు తెరకెక్కించాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేశారు చిత్ర బృందం. డైరెక్టర్ పరశూరాం, కీర్తి సురేష్ ఫుల్ బిజీ బిజీ గా ఇంటర్వ్యుల్లు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మే 7న సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మూవీ టీం.

ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఓ పవర్ ఫుల్ స్టార్ హీరో ని అతిథి గా ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ వైపు రాజకీయాలతో..మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్కారు వారి పాట సినిమాకు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, పవన్ తో పాటి మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారట. మహేష్ కోసం పవర్ స్టార్ ప్రీరిలీజ్ గెస్ట్ గా రానున్నారని టాక్ వైరల్ అవుతుండటంతో ఇద్దరి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. మరి చూడాలి మూవీ మేకర్స్ దీని పై అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో..?

Share post:

Popular