పవన్ టైటిల్..పెద్ద తలనొప్పిగా మారిందే.. ?

ఓ సినిమా కి వాడుకున్న టైటిల్ ని మరో సినిమా కి పెట్టుకుంటున్నారు నేటి కాలం సినిమా డైరెక్టర్లు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి..ఆ టైటిల్ వాళ్ల స్టోరీ కి మ్యాచ్ అవ్వడం..లేదా ఆ సినిమా టైటిల్ ద్వారనే క్రేజ్ సంపాదించుకుకోవాలి అనుకోవడం. ఇలా ఆలోచించే..డైరెక్టర్ శివ నిర్వాణ..తన తదుపరి సినిమాకి ఖుషి అని టైటిల్ పెట్టిన్నట్లు ఉన్నారు. మనకు తెలిసిందే..ఖుషి అనగానే మనందరికి గుర్తు వచ్చేది..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ..”ఖుషీ”.

పవన్ , భూమిక జంటగా నటించిన ఈ సినిమా వాళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ సినిమా టీవీల్లో వస్తే అత్తుకుపోయి మరి జనాలు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు మరో లోకానికి తీసుకెళ్తాయి. “అమ్మాయే సన్నగా ” పాట అయితే..కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. అంతటి బ్లాక్ బస్టర్ టైటిల్ ని తాను తెరకెక్కించబోతున్న రోమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాకి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. విజయ్-సమంత హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని నిన్న రిలీజ్ చేశారు.

లుక్స్ పరంగా సామ్-విజయ్ ఆకటుకుంటున్నా కానీ..చిత్రానికి ఖుషీ టైటిల్ పెట్టడం పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ నే కాదు పవన్ సినిమా టైటిల్ కూడా పవర్ ఫుల్ గానే ఉంటుంది..జర జాగ్రత్త బ్రదర్ అంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరు అయితే, అస్సలు ఆ లుక్స్ కి ఆ టైటిల్ కి ఏం మ్యాచ్ అవ్వడం లేదు. మరి ఎందుకో పెట్టారో అని అనుకుంటున్నారు. ఇంకొందరు పవన్ క్రేజ్ ని వాడుకోవడానికే..ఇలా డైరెక్టర్ అవసరం లేని..అర్ధం లేని టైటిల్ ని పెట్టారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందో..?

Share post:

Latest