పిల్లలు కోసం పట్టింపులను పక్కన పెట్టేసిన పవన్..రేణు ఆనందం చూశారా..!!

ఈ ఫోటో చూస్తుంటే మీకు ఎలా ఉంది..చూడ ముచ్చటగా ఉందిగా..ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాని..కంప్లీట్ ఫ్యామిలీ పిక్ అనిపిస్తుందిగా. యస్..ఇప్పుడు పవన్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. మనకు తెలిసిందే..పవన్ కల్యాణ్ ..హీరోయిన్ రేణూదేశాయిని ప్రేమించి..కొన్నాళ్ళు కాపురం చేశాక…ఓ బిడ్డ కన్ ఫామ్ అయ్యాక..మూడుముళ్ళ బంధం తో అఫిషియల్ భార్య భర్తలుగా ఒక్కటైయ్యారు. ఆ తరువాత కొన్నాల్ళు వీళ్ల కాపురం బాగానే సాగింది..ఫైలితంగా మరో పాప పుట్టింది.

వావ్..ఆల్ కూల్..పవన్ కంప్లీట్ ఫ్యామిలీ రెడీ ..ఇక ఏం ప్రాబ్లమ్ లేదు అనుకుంటుండగా..వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అని తెలిసింది. రీజన్ ఏవో అధికారికంగా చెప్పనప్పటికి ..వీళ్లు ఫ్రెండ్లీ గానే విడిపోయారు అని వాళ్ళ మాటల్లోనే అర్ధం అవుతుంది. ఆ నాడు నుండి ఈ నాడు వరకు..ఇద్దరు ఎవ్వరిని ఎవ్వరు కూడా తిట్టుకోవడం..వల్గర్ కామెంట్స్ చేయడం లాంటివి చేయలేదు. కానీ, మధ్యలో కొందరు పవన్ ఫ్యాన్స్ అంటూ..రేణూ ని ఇబ్బంది పెట్టినా..తన దైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ వచ్చింది.

ఇక రీసెంట్ గా అకీరానందన్ కోసం మళ్ళీ కలుసుకున్నారు పవన్-రేణు. అకీరా నందన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. ఎవ్వరు ఊహించని విధంగా పవన్ గ్రాడ్యుయేషన్ డే కి రావడం తో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అకీరా నందన్ ఆనందం కోసం వచ్చిన పవన్…ఆ క్షణాలకు గుర్తుగా తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పిల్లల కోసం పవన్ పట్టింపులు అన్నింటిని పక్కన పెట్టేసి..వాళ్ల సంతోషం కోసం గ్రాడ్యుయేషన్ డే వెళ్లారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

Share post:

Popular