డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మాసివ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినా, ఇంకా ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో త్వరలో రాబోతున్న తారక్ పుట్టినరోజున ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు తారక్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

అయితే తన పుట్టినరోజైన మే 20న డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు తారక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివతో తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని ప్రారంభించబోతున్న తారక్, అదే రోజున మరో సినిమాకు సంబంధించి కూడా అప్‌డేట్ ఇవ్వనున్నాడట. తారక్ 31వ చిత్రాన్ని కూడా అదే రోజున అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తారక్ 30వ చిత్రం గురించి మాత్రమే అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తారక్ 31వ చిత్రం ఎవరితో తెరకెక్కిస్తున్నారు, అసలు ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుంది అనే సందేహం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ తారక్ పుట్టినరోజు నాడు ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మే 20 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఒక్కసారిగా ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిందని చెప్పాలి.

Share post:

Popular