షాకింగ్: ముసలోడా అంటూ..బిగ్ బి కి ఘోర అవమానం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంత మంది యువత నోటికి వచ్చింది మాట్లాడుతూ..ఇష్టం వచ్చిన్నట్లు బీహేవ్ చేస్తున్నారు. మనం ఉన్నది ఎక్కడ..మనకు మన తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతులు ఇవేనా అని ఒక్కసారి వాళ్లను వాళ్ళు ప్రశ్నించుకుంటే …అప్పుడు వాళ్లు చేస్తున్న పనులు ఎంత నీచమైనవో అర్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో తరచూ మనం ఎక్కువ వింటున్న పదం..సెలబ్రిటీలు పై నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. లేదా ట్రోలింగ్స్ ఎక్కువైయాయి. అంతకముందు అంతా ఇలా లేదు కేవలం సోషం మీడియా అందుబాటులోకి వచ్చాకనే ఇలా జరుగుతున్నాయి.

సినీ సెలబ్రిటీలి చిట్ చాట్ చేసేటప్పుడు వల్గర్ కామెంట్స్ చేయడం..వాళ్లు ఏదైన మెసేజ్ చేస్తే దానిని ట్రోల్ చేయడం చాలా కామన్ అయిపోయింది. దీనిని ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు తిప్పికొడుతున్న..వాళ్లకు కౌంటర్లు ఇస్తున్నా..ఆ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు కొందరు జనాలు. రీసెంట్ గా అలాంటి పరిస్ధితినే ఫేస్ చేశాడు బాలీవుడ్ లెజండ్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఆయన అంటే ఇష్టం లేని వారు ఉండరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్స్ సైతం ఆయనను గౌరవిస్తారు..హైదరబాద్ లో ఆయన షూటింగ్ చేస్తున్నారంటే వెళ్లి మరీ మిట్ అయ్యి వస్తారు అంతటి రెస్పెక్ట్.

మరి అలాంటి పెద్ద మనిషిని పట్టుకుని..ముసలోడా..అంటే అది తప్పు మాట కాదా. నేడు ఉదయం 11:30 నిమిషాలకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గుడ్ మార్నింగ్ అంటూ ఓ మెసేజ్ పెట్టారు. దీనికి చాలా మంది వెర్రి గుడ్ మార్నింగ్..గుడ్ మార్నింగ్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. కానీ ఓ ముగ్గురు నలుగురు మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. “టైం ఎంత ఇప్పుడు..ఇది మార్నింగ్ నా”..అంటూ పెట్టగా..బిగ్ బీ..”సారీ, రాత్రి షూటింగ్ ఉన్నింది. లేట్ అయ్యింది. ఇప్పుడే లేచాను. మీ టైం డిస్టర్బ్ చేసుంటే క్షమించండి “అంటూ రిప్లై ఇచ్చారు. ఇంకో నెటిజన్ ..”ఇది మధ్యహ్నం ముసలోడా” అంటూ కామెంట్ పెట్టగా బిగ్ బీ కూలొ గా రిప్లై ఇస్తూ..”మీరు చాలా కాలం బ్రతకాలి అని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా..కానీ మిమ్మల్ని ఎవ్వరు కూడా ఇలా ముసలోడా అని పిలిచి అవమానించకూడదు” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో బిగ్ బి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చాడు …అంటూ సోషల్ మీడియా లో ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజుల్లో కొందరు నెటిజన్స్ నోటి దూల కి అడ్డు అదుపు లేకుండా పోతుంది.

Share post:

Popular