సర్కారు వారి పాట: హాట్ టాపిక్ గా మారిన మహేశ్ రెమ్యూనరేషన్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం..”సర్కారు వారి పాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే12న ధియేటర్స్ లొ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ పరంగా దూసుకుపోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా కళావతి సాంగ్ అయితే టాప్ లేపేస్తుంది. సినిమా స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేక పోయినా..కీర్తి మహేశ్ మధ్య వచ్చిన లవ్ ట్రాక్ సీన్స్ బాగా అలరించాయి. దీంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అటు మాస్ ఆడియన్స్ ఇటు క్లాస్ ఆడియన్స్ ఇద్దరిని మహేశ్ బాబు మెప్పించడంతో ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్‌ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. దీంతో మరోసారి మహేశ్‌ బాబు సత్తా ఏంటో ప్రూవ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. అయితే స‌ర్కారువారి పాట రెండో రోజు వ‌సూళ్లు చాలా దారుణంగా పడిపోయాయి. దీనికి కారణం సినిమా పై కొందరు నెగిటీవ్ కామెంట్స్ చేస్తుండటమనే అంటున్నారు సినీ విశ్లేషకులు.

అయితే, ఈ సినిమా కి మహేశ్ తీసుకున్న పారితోషకం నెట్టింట వైరల్ గా మారింది. జనరల్ గా ప్రజెంట్ ఉన్న అందరు స్టార్ హీరో ఒక్కో సినిమాకి 70 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు అంటూ డిమాండ్ చేసి మరి తీసుకుంటున్నారు. కానీ మహేశ్ ఈ సినిమా కి కేవలం 35 కోట్లు మాత్రమే పుచ్చుకున్నరట. ఇక ఈ సినిమా డైరెక్టర్ 10 కోట్లు..హీరోయిన్ కీర్తి సురేష్ 2కోట్ల 50 లక్షలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, మహేశ్ తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువని..ఎంత డబ్బు తీసుకున్నా మహేశ్ అది అంతా కూడా చిన్నారుల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తాడు.. అలాంటప్పుడు మహేశ్ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నా తప్పు లేదంటున్నారు ఆయన అభిమానులు. ఇక మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Share post:

Latest