తారక్ క్షమాపణలు వెనుక ఇంత జరిగిందా..అంత బాధపడ్డారా..?

టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున అందరు చెప్పే పేరు “NTR”. కేవలం అభిమానులే కాదు..బడా బడా సినీ ప్రముఖులు సైతం ఈ మాటే అంటున్నారు. కొట శ్రీనివాస రావు కూడా ఈ మధ్య ఈ విషయాని తన ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఒక గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్నీ తారక్ లో ఉన్నాయని. ఆయన బ్లడ్ లోనే ఆ నటన ఉందని..రాబోయే కాలంలో టాలీవుడ్ ని ఏలేసే నటుడు NTR అని చెప్పుకొచ్చారు. ఇక అలాంటి నటుడు బహిరంగంగా అభిమానులకు సారీ చెప్పారు.

మే 20 న NTR పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేశారు ఆయన ఫ్యాన్స్. అర్ధరాత్రి నుండే కేక్ కట్ చేసి..జై NTR అంటూ అరుస్తూ ఆయన ఇంటి ముందు హంగామా చేశారు. అది వాళ్ల అభిమానం. తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే అది వాళ్ల కి ఓ పండుగ తో సమానం. దీంతో తారక్ బర్త డే నాడు రాత్రి ఎన్టీఆర్ నివాసం ఉండే జూబ్లీహిల్స్ లో ప్రాంతంలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి జై NTR అంటూ నినాదిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అదే రోడ్డు మీద రాకపోకలకు అంతరాయం ఏర్పడిందట. మనకు తెలిసిందే ఆ రోడ్డు లోనే మరింత మంది స్టార్ సెలబ్రిటీలు కూడా నివసిస్తున్నారు.

ఈ క్రమంలో నే సమాచారం అందుకున్న పోలీసులు..అక్కడికి చేరుకుని వాళ్ల ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారట. అయినా కూడా వాళ్లల్లో కొందరు వినకుండా హద్దులు దాటడంతో..వారిని పోలీస్ స్టేషన్ కు పంపించి ఆ నైట్ అంతా ఉంది..ఉదయం కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారట. ఈ విషయం తెలుసుకున్న తారక్ చాలా బాధపడ్డారట. అందుకే ఆ విషయం తెలుసుకున్న మరో క్షణమే ..అభిమానులకు సారీ చెప్పుతూ..ట్వీట్ చేసారు. దీంతో అభిమానుల పై తారక్ కు ఉన్న ప్రేమ మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇదే కాదు ఎప్పుడు ఫంక్షన్లకి వెళ్లినా తారక్..ఒక్క మాట చెప్పుతుంటారు. “మీరు ఎంత జాగ్రత్తగా ఇక్కడికి వచ్చారో అంతే జాగ్రత్తగా మీ ఇళ్లకి వెళ్లండి..జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి అంటూ” ఓ అన్న లా అభిమానులకు చెప్పుతుంటాడు తారక్.

Share post:

Popular