జూనియర్ ఎన్టీఆర్ డైట్ & ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏలుతున్న టాప్ హీరోలలో కూడా ఒకరు. నిన్ను చూడాలని అనే చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు సరికొత్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు.

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రం కోసం ఎన్టీఆర్ ఏకంగా 9 కేజీలు మజిల్స్ పెంచడం విశేషం. ఈ సినిమాలో ఆయన కొమురంభీం పాత్రలో కనిపించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. అయితే ఎన్టీఆర్ అంత ఫిట్ గా మారేందుకు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు అనేది ఇపుడు ప్రశ్న గా మారుతోంది. అయితే ఇప్పుడు ఆయన అలా అవ్వడానికి .. ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.

ఎన్టీఆర్ తన బాడీ ని మెయింటైన్ చేసుకోవడం కోసం డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఆయన ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇక ఆ డైట్ లో భాగంగానే ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన చికెన్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారట.. ముఖ్యంగా తను తినే ఆహారంలో ఖచ్చితంగా ప్రోటీన్స్ , విటమిన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారట. అంతే కాకుండా తను తినే ఆహారంలో ఫ్యాట్ తక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్.

ఇలాంటి విషయాలన్నీ స్వయంగా ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెప్పడం విశేషం. ఇక ఎన్టీఆర్ తన ఎనర్జీ లెవల్స్ ను పెంచుకోవడానికి బాదంపప్పు, వాల్ నట్స్ ని భోజనానికి ముందు తీసుకుంటారట . అంతేకాకుండా తన రోజువారి డైట్ లో కచ్చితంగా పండ్లు కూడా తీసుకుంటారు అని తెలియజేశారు. ఇక ప్రతిరోజు జిమ్ లో చాలా కష్టపడతారు. ఇక గంటసేపు వ్యాయామాలు చేస్తారు, ఇక జిమ్ లో కష్టపడుతున్న ఒక వీడియో ని కూడా ట్రైనర్ షేర్ చేయడం గమనార్హం.

Share post:

Popular