40-45 సీట్ల‌లో జ‌న‌సేన పోటీ.. ఎక్క‌డెక్క‌డంటే!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అధికారంలో వ‌చ్చితీరుతామ‌ని.. ప్ర‌జ‌ల‌కుప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ దిశ‌గా అడుగులు వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొత్తుల‌కు కూడా సిద్ధ‌మ య్యారు. ఈ విష‌యంపైనా.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను.. జ‌న‌సేన నాయ‌కుల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నా రు. ఇక‌, ఎక్క‌డ ప్ర‌సంగిస్తున్నా.. కూడా.. పొత్తుల గురించిన చ‌ర్చ చేస్తున్నారు. ఫ‌లితంగా.. ప్ర‌జ‌ల‌ను కూడా మాన‌సికంగా.. ప‌వ‌న్ రెడీ చేస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక‌, ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. పార్టీనేత‌ల‌ను.. అభిమానుల‌ను కూడా పొత్తు ల దిశ‌గా న‌డిపించే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే చూచాయ‌గా.. సంకేతాలు కూడా పంపించారు. పొత్తులు పెట్టుకుంటే.. అది ప్ర‌జ‌ల కోస‌మేన‌ని తేల్చి చెప్పారు. అయితే.. క‌లిసి వ‌చ్చే పార్టీలు ఎలా ఉన్నా.. జ‌న‌సేన‌, టీడీపీల మ‌ధ్య మాత్రం పొత్తుల‌కు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పోటీ చేస్తే.. ఎక్క‌డెక్క‌డ పోటీ చేస్తుంది.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. అనే అంశాలు కీల‌కంగా మారాయి.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ను బ‌ట్టి చూస్తే.. 40 నుంచి 45 అసెంబ్లీ స్థానాల్లోను.. 4 నుంచి 5 పార్ల‌మెంటు స్థానాల్లోనూ జ‌న‌సేన పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వీటిని టీడీపీ నుంచి కేటాయించే అవ‌కాశం ఉంది. దీనిపైనా.. చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. త్యాగాలు సిద్ధం కావాలంటూ.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు చెప్ప‌క‌నే చెప్పారు. వీటి ప్ర‌కారం.. జిల్లాల వారీగా చూస్తే..

శ్రీకాకుళం : ఇచ్ఛాపురం, పాల‌కొండ‌
విజ‌య‌న‌గ‌రం: శ్రుంగవ‌ర‌పు కోట‌, నెల్లిమ‌ర్ల‌
విశాఖ‌: భీమిలి, అర‌కు లేదా పాడేరు, య‌ల‌మంచిలి, అన‌కాప‌ల్లి, పెందుర్తి(వీటిలో రెండు లేదా మూడు)
తూర్పు: పిఠాపురం, రామ‌చంద్రాపురం, రాజ‌మండ్రి, కాకినాడ సిటీ, రూర‌ల్‌, రాజాన‌గ‌రం, రాజోలు, అమ‌లాపురం
వెస్ట్ గోదావ‌రి: న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం, ఏలూరు, భీమ‌వ‌రం, త‌ణుకు, ఉంగుటూరు
కృష్ణా: కేక‌లూరు, పెడ‌న‌, నూజివీడు, విజ‌య‌వాడ వెస్ట్‌, సెంట్ర‌ల్‌
గుంటూరు: ఈ స్ట్‌, స‌త్తెన‌ప‌ల్లి, తెనాలి, వేమూరు
ప్ర‌కాశం: గిద్ద‌లూరు, చీరాల‌
నెల్లూరు: నెల్లూరు సిటీ
చిత్తూరు: తిరుప‌తి, శ్రీకాళ‌హ‌స్తి,
అనంత‌పురం: అనంత‌పురం టౌన్‌
క‌ర్నూలు: ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన ప‌ల్లె, ఆలూరు
క‌డ‌ప‌: రాజంపేట‌, మైదుకూరు

జ‌న‌సేన కోరుతున్న ఐదు ఎంపీ సీట్లు ఇవే
అన‌కాప‌ల్లి
కాకినాడ‌
మ‌చిలీప‌ట్నం
చిత్తూరు
రాజంపేట‌