వ‌రుస‌గా రెండో సారీ జ‌గ‌న్ ` బెస్ట్ సీఎం `

ఏపీ సీఎం జగ‌న్ వ‌రుస‌గా రెండోసారి కూడా `ఉత్త‌మ ముఖ్య‌మంత్రి` అవార్డును అందుకున్నారు. గ‌త ఏడా ది కూడా ఆయ‌న ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌కావ‌డం గ‌మ‌నార్హం. 2021 నుంచి ఏటా `స్కోచ్‌` సంస్థ దేశ‌వ్యాప్తంగా ప‌లు విభాగాలు, రంగాల‌కు సంబంధించిన ఉత్తమ ప్ర‌తిభ చూపిన ముఖ్య‌మంత్రుల‌కు అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది.గ‌త ఏడాది కూడా ఆయా విభాగాల్లో సీఎం జ‌గ‌న్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఏడాది కూడా ఆయ‌న వ‌రుస‌గా ఆయ‌న తొలిస్థానంలో నిల‌బ‌డ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఏడాది స్కోచ్ సంస్థ గ్రామీణ ప్రాంత అభివృద్ధి ప‌నుల ఆధారంగా ఉత్త‌మ ముఖ్య‌మంత్రిని ఎంపిక చేసింది. గ్రామీణ అభివృద్ధికి రాష్ట్రాలు ఇస్తున్న ప్రాధాన్యం.. ఆయా ముఖ్య‌మంత్రులు చేస్తున్న ప‌ని.. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో జ‌రుగుతున్న ప‌నితీరు ఆధారంగా అవార్డుల‌కు ఎంపిక చేసింది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. నిల‌క‌డైన ప‌నితీరు.. గ్రామాల్లో జ‌రుగుతున్న స‌మ‌గ్ర‌మైన అభివృద్ధి వంటివాటిని తీసు కుని ముఖ్య‌మంత్రికి అవార్డును ప్ర‌క‌టించింది.

ఈ విభాగాల్లో ముందు వ‌రుస‌లో నిలిచింద‌ని స్కోచ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ప‌ది రాష్ట్రాల్లో ప‌నితీరును గ‌మ‌నించిన స్కోచ్ ప్ర‌తినిధులు.. ఏపీని ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ట్టు గ‌మ‌నించారు. సెకండ్ ప్లేస్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని ప‌శ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిసా, నాలుగో స్థానంలో గుజ‌రాత్‌, ఐదో స్థానంలో మ‌హారాష్ట్ర, ఆరోస్థానంలో తెలంగాణ‌, ఏడో ప్లేస్‌లో మ‌ధ్యప్ర‌దేశ్, ఎనిమిదో ప్లేస్‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, తొమ్మిదో స్థానంలో సిక్కిం ఉన్నాయి.

ఇక ఏపీలో సంక్షేమం బాగా జ‌రుగుతోంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రికి సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని కూడా జగ‌న్ ప్ర‌భుత్వానికి దేశ‌వ్యాప్తంగా మంచి పేరు ప్ర‌ఖ్యాతులే ఉన్నాయి. అందుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా అవార్డులు , రివార్డులు బాగానే ఉన్నాయి.

Share post:

Popular