మెగాస్టార్‌పై డేవిడ్ వార్న‌ర్ వీడియో.. అచ్చు గుద్దిన‌ట్టు దింపేశాడుగా (వీడియో)..

ఇప్పుడు క్రికెట్ లో కూడా సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మ‌నం ప్ర‌తి రోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు సినిమా ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌డుతోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్లు కూడా త‌మ మ్యాచ్‌ల్లో బాహుబ‌లి, పుష్ప‌, త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ స్టైల్స్‌ను ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమాలతో ఈ ప్ర‌భావం బాగా ఎక్కువుగా క‌నిపిస్తోంది.

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ మ‌న తెలుగు హిట్ సినిమాల స్టైల్స్ మామూలుగా ఫాలో అవ్వ‌డం లేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో సినిమాలో బుట్ట‌బొమ్మ సాంగ్‌తో ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్‌కు బాగా ద‌గ్గ‌రైపోయాడు వార్న‌ర్‌. వార్న‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు.

కొద్ది రోజులుగా తెలుగు సినిమాల‌పై వ‌రుస‌గా ఏదో ఒక వీడియో వ‌దులుతూ వ‌స్తోన్న వార్న‌ర్ తాజాగా టాలీవుడ్ బాస్ మెగాస్టార్‌పై అందులోని తన కం బ్యాక్ సీన్‌పై ఇంట్ర‌స్టింగ్ రీల్ చేశాడు. చిరంజీవి చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ హీరోగా వ‌చ్చిన బ్రూస్ లీ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ను కాపాడేందుకు చిరు స్టైలీష్‌గా ఎంట్రీ ఇస్తాడు.

ఇప్పుడు ఆ ఎంట్రీ వీడియోపై వార్న‌ర్ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఇప్పుడు అది మంచి రెస్పాన్స్ తో వైరల్ అయ్యిపోతుతుంది. మెగా ప్యాన్స్ ఈ వీడియోను బాగా వైర‌ల్ చేస్తున్నారు.