క‌మ‌ల్‌హాస‌న్ మాజీ భార్య సారిక‌కు ఆ స్టార్ క్రికెట‌ర్‌తో ఎఫైర్‌..?

గత కొన్ని సంవత్సరాల నుండి అటు ఫిలిం ఇండస్ట్రీ కి.. ఇటు క్రికెట్ అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎంతో మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తారలు క్రికెటర్ల ను వివాహం చేసుకున్నారు అని.. మరికొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని తిరిగి వివాహ బంధానికి మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొంత మంది క్రికెటర్ల చేతిలో మోసపోయి వేరొక వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు . అలాంటి వారిలో కమలహాసన్ మాజీ భార్య సారిక హాసన్ కూడా ఒకరు.

ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సారిక చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత ఎంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని .. డబ్బులు లేక థియేటర్లలో స్టేజ్ షో కూడా ఇచ్చానని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. కేవలం రెండు మూడు వేల రూపాయల కోసం ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చి చాలా కష్ట పడ్డాను అని.. ఆర్థిక పరిస్థితి కూడా చాలా దెబ్బతినింది అని ఆమె తెలిపింది. నిజానికి సారిక ఢిల్లీ లోని రాజ్ పుత్ ల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక వీరి తండ్రి చిన్నతనంలోనే తన తల్లికి విడాకులిచ్చి దూరంగా వెళ్ళిపోయాడు.

తన తల్లి మాత్రం పెద్దగా పట్టించుకునేది కాదు. దాంతో సారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక సారిక సంపాదించిన డబ్బులతోనే వాళ్ళ అమ్మ 5 అపార్ట్మెంట్లను కూడా కొనుగోలు చేసింది. ఇక అయినా కూడా సారిక ను ఆమె ఏ రోజు కూడా సరిగా చూసుకునేది కాదు. ఒక్కోసారి ఇంట్లోకి కూడా రానిచ్చేది కాదు. ఇక షూటింగ్ నుంచి వచ్చాక బయట ఉన్న కార్లోనే నిద్రపోయేది సారిక. కానీ కొన్ని రోజుల తర్వాత తన తల్లి మరణించింది. ఇక ఆస్తులన్ని తన తల్లి పేరు పైన ఉంటే అమీర్ ఖాన్ కజిన్ నుజీమ్ సహాయంతో తన ఆస్తులన్నీ తిరిగి తెచ్చుకుంది సారిక.

అప్పుడే తనకు మంచి రోజులు మొదలయ్యాయి. కెరియర్ పరంగా కూడా స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రోజుల్లో ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ను ఆమె ప్రేమించింది. అంతేకాదు కపిల్ దేవ్ కోసం ఈమె చండీఘడ్ కూడా వెళ్ళేది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చూసి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఒకసారి అనుకోకుండా సారిక మనసు ముక్కలైంది.

ఎందుకంటే కపిల్ దేవ్ ఇది వరకే రోసీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు అని.. ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు సారికకు తెలిసింది. ఇక దాంతో అక్కడి నుంచి అతనికి పూర్తిగా దూరం అయిపోయింది. ఇక కమల్ హాసన్ తో డేటింగ్ చేసి శృతిహాసన్ జన్మించిన తర్వాత అతడిని వివాహం చేసుకోవడం జరిగింది.

Share post:

Popular