ద్యావుడా ..RRR కాదు ఈ ఏడాది ఆ సినిమా నే టాప్..రాజమౌళి పరువు హుష్ కాకి ..?

కోట్లు పెట్టి సినిమా తీసిన ఆ మూవీ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోతే..ఆ డైరెక్టర్ తో సహా..ఫుల్ మూవీ టీం ఫెయిల్ అయ్యిన్నట్లే. ఆ విషయాని మనం రాధేశ్యామ్ సినిమాతో క్లీయర్ గా అర్ధం చేసుకోవచ్చు. కోట్లు కుమ్మరించిన సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక అదే రీతిలో ఈ ఏడాది బాక్స్ ఆఫిస్ వద్ద కొన్ని భారీ సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

కానీ, ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ మూవీ ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు RRR. మరికొందరు KGF2. ఎందుకంటే సినిమాకి కోట్లు ఖర్చు చేసారు..బడా స్టార్స్ ని పెట్టి తెరకెక్కించారు.. ప్రమోషన్స్ కళ్లు చెదిరేలా చేశారు..వసూళ్ళ పరంగా కూడా రెండు సినిమాలు 1000 కోట్లు దాటేసింది. దీంతో అందరు ఈ సినిమాలే టాప్ అనుకుంటున్నారు. కానీ, రీసెంట్ గా సినీ విశ్లేషకులు దిమ్మ తిరిగిపోయే న్యూస్ వినిపించారు.

kgf2
kgf2

మనం అనుకున్నట్లు ఈ ఏడాది టాప్ సినిమా RRR కాదు, KGF 2 కాదట..ఎటువంటి అంచనాలు లేకుండా స్లో గా స్టార్ట్ అయ్యి..సైలెంట్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ఒక్క పుట్టు మచ్చ తోనే బోలెడు ప్రమోషన్స్ చేసిన “DJ టిల్లు” సినిమా టాప్ అంటూ ట్రేడ్ పండితులు చెప్పుతున్నారట. సిద్ధు జొన్నలగడ్డ హీరో గా నటించిన ఈ సినిమా ..కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది..కానీ సాధించిన వసూళ్లు మాత్రం ఢబుల్ రేంజ్ లో ఉన్నాయి. 30 కోట్ల గ్రాస్..17 కోట్ల షేర్ రాబట్టి సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక RRR,KGF2 లకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో మనకు తెలిసిందే. ఈ విధంగా DJ టిల్లు టాప్ సినిమా అంటూ ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చారు. దీంతో యాంటి రాజమౌళి బ్యాచ్..కావాలనే ఆయనని కించపరుస్తూ…కామెంట్స్ చేస్తున్నారు. #DJTILLUని ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు కంటే చిన్న సినిమాలే ప్రజలను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

Share post:

Popular