తమన్నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ .. ఇక అంతా దేవుడి దయ..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందరి కళ్ళు మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా వైపే ఉంటాయి. అలాంటి అందం ఆమె సొంతం. ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హ్యాపీ డేస్ సినిమాలో మధు రోల్ లో కనిపించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే అంతే అందంగా ..అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్న ఈ సమయంలోను అమ్మడు ప్లేస్ చేజార్చుకోకుండా జాగ్రత్తలు పడుతూ.. ఇప్పటికి కుర్ర బ్యూటీలకు సమానంగా..అందాల ప్రదర్శన ఇస్తుంది.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమా లు చేస్తూ రెండు చేతులా సంపాదించుకున్న ఈ అమ్మడు కి హీందీ ఇండస్ట్రీ పెద్ద గా కలిసి వచ్చిన్నట్లు లేదు. తెలుగు, తమిళంలో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు.. హీందీలో మాత్రం బోల్తా కొట్టింది. గ్లామర్ పరంగా అక్కడ లుక్స్ పడుతున్నాయే కానీ, నటన పరంగా తమన్నా అక్కడ నిల్ అని ముద్ర వేయించుకుంది. దానికి తగ్గట్లే తమన్నా హీందిలో చేసిన సినిమాలు తన ఆశల పై నీళ్ళు చల్లాయి. హిమ్మత్ వాలా, ఎంటర్టైన్మెంట్.. లాంటి డిజాస్టర్లు తమన్నాకు బాలీవుడ్ మీద ఆశలు లేకుండా చేశాయి.

ఇక ఇప్పుడు ఈ టైంలో తమన్నా చేస్తున్న సినిమా పై నే ఆశలు ఉన్నాయి. చాందిని బార్, ఫ్యాషన్ లాంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలు తెరకెక్కించిన ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్‌తో తో ఆమె సినిమా స్టార్ట్ చేసింది. వీళ్లిద్దరి కాంబోలో కొన్ని నెలల కిందట ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా మొదలైంది. ఓపెనింగ్ షాట్ తోనే మంచి ఇంప్రేషన్ కొట్టేసిన ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుని ఉన్నారు తమన్నా ఫ్యాన్స్. పైగా తమన్నా డీ గ్లామరస్ లుక్ లో కనిపించనుంది. మధుర్ మామూలుగా హీరోయిన్ ఓరియంటేడ్ సినిమాలే ఎక్కువుగా తీస్తుంటాదు. పరిమిత బడ్జెట్లో, చాలా తక్కువ రోజుల్లో సినిమా తీసేస్తుంటాడు. ‘బబ్లీ బౌన్సర్’ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయితే తమన్నా కు హీందిలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. మళ్ళీ ఫాం లోకి రావచ్చు.. ఒక్కవేళ్ళ బెడిసికొడితే.. ఇక సౌత్ సినిమాలే గతి తమన్నాకు అన్నట్లు తయారవుతుంది పరిస్ధితి. మరి చూడాలి తమన్నా ఫేట్ ఎలా మారబోతుందో..?

Share post:

Latest